ప్రత్యూష “ఆర్ధిక బాధలు” వినిపించిన పనిమనిషి!

pratyusha banerjee's servant about financial trouble ‘చిన్నారి పెళ్లి కూతురు’ నటి ప్రత్యూష బెనర్జీది ఆత్మహత్య వెనుక అనేక కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆత్మహత్యకు గురైందని చెబుతున్న ప్రత్యూష బెనర్జీ, తీవ్ర శారీరక హింసకు గురై మరణించిందని పోలీసులు తమ నివేదికలో స్పష్టం చేస్తుండగా, స్నేహితులు, కుటుంబ సభ్యులంతా రాహుల్ రాజ్ సింగ్ హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్న వైనం తెలిసిందే.

ఇదిలా ఉంటే… ప్రత్యూష ఇంట్లో పనిమనిషిగా విధులు నిర్వహిస్తున్న రేణూసిన్హా పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. మూడు నెలల క్రితం ప్రత్యూష ఇంట్లో పనికి చేరిన రేణూసిన్హా వద్ద, వివిధ సందర్భాల్లో తక్కువ మొత్తంలో ప్రత్యూష తన వద్ద నుంచి నగదు అప్పుగా తీసుకున్నారని చెబుతున్నారు. ప్రత్యూష వద్ద ఖర్చులకు కూడా డబ్బులు ఉండేవి కాదని, ఆర్ధిక సంబంధమైన విషయాలన్నీ రాహుల్ చూసుకునే వాడని, అప్పుడప్పుడు వారింటి నుండి అరుపులు వినిపించేవని పోలీసులకు తెలిపారు.

ADVERTISEMENT

అర్ధరాత్రి సమయాల్లో ప్రత్యూష గట్టిగా ఏడ్చేదని, రాహుల్ వెళ్లిపోయాక గొడవలకు కారణాలు చెప్పుకుని తన వద్ద బాధపడేదని, తన మాజీ బాయ్ ప్రెండ్స్ ను గుర్తుచేసి హింసించే వాడని తనకు చెప్పినట్లుగా రేణు సిన్హా తెలిపారు. సినిమా, షాపింగ్ లాంటి చిన్న చిన్న కోరికలకు కూడా రాహుల్ అభ్యంతరం చెప్పేవాడని, అంతే కాకుండా రాహుల్ మాజీ ప్రేయసి వచ్చి ప్రత్యూషను నానా దుర్భాషలాడి వెళ్లేదని సవివరంగా తెలిపింది.

ADVERTISEMENT
Latest Stories