ప్రత్యూష ప్రియుడుపై కేసు నమోదు… ఐసీయూలో వింత ప్రవర్తన..!

Pratyusha boyfriend Rahul RajSingh‘చిన్నారి పెళ్లికూతురు’ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్లు కనపడుతోంది. ప్రత్యూష ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ను రెండు సార్లు విచారించిన పోలీసులు… ప్రత్యూష ఆత్మహత్యకు కారణం రాహుల్ అని తేల్చి, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. రాహుల్ ప్రత్యక్షంగా హత్య చేయనప్పటికీ, ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. తన మాజీ ప్రేయసితో కలిసి ప్రత్యూషను మానసికంగా, శారీరకంగా రాహుల్ హింసకు గురి చేసినట్టు తెలుస్తోంది.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే, ప్రస్తుతం శ్వాస సంబంధిత ఇబ్బందితో ఐసీయూలో చికిత్స పొందుతున్న రాహుల్ స్థితిపై ఆయన తండ్రి నాటకీయ పరమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. “తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని, ఐసీయూలో చికిత్స పొందుతున్న తన కుమారుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని, ప్రత్యూష తనను పిలుస్తోందని, తాను కూడా వెళ్తానని అంటూ కలవరిస్తున్నాడని, తన కొడుకు ఏమైపోతాడో” అంటూ చేసిన వ్యాఖ్యలు మరీ నాటకీయతను తలపిస్తున్నాయన్న కామెంట్లు పడుతున్నాయి. రాహుల్ తండ్రి మొదట నుండి ఈ కేసును తన కొడుకు పైకి రాకుండా పక్క దారి పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని బాలీవుడ్ బుల్లితెర వర్గాలు చెప్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories