శృతిమించింది… ఆగిపోయింది..!

Praveen sattaru- Ram Pothineni Movie Shelved‘గుంటూరు టాకీస్, గరుడవేగ’ ఫేం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఓ సినిమా ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో రాజశేఖర్ విలన్ గా కూడా నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇక ఈ సినిమాకు సంబంధించి ఒకే వార్త ఉంటుంది, అదే సినిమా ఆగిపోయింది అని! అవును స్వయంగా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ADVERTISEMENT

హిమాలయాల వంటి కీలకమైన ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ చేయాల్సి ఉందని, అయితే అక్కడ షూటింగ్ చేయడం చాలా బడ్జెట్ తో కూడుకున్న విషయం కావడంతో, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఆపేసామని ప్రవీణ్ సత్తార్ స్పష్టం చేసారు. తన చేతిలో ఇంకా కధలు ఉన్నాయి, ప్రస్తుతానికి తన తదుపరి సినిమా ఏంటన్నది ఇప్పుడే చెప్పలేనని తెలిపారు. మరోవైపు రామ్ ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories