ట్రైలర్ టాక్: ముద్దుగుమ్మ ఇరగదీసింది!

Jai Gangaajal Trailer talkవెండితెరపై అందాలు ఆరబోయడమే కాదు, అభినయంలోనూ అదరగొట్టే ప్రియాంక చోప్రా ప్రస్తుతం “బాజీరావు మస్తానీ” చిత్రం ద్వారా ధియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ప్రియాంక 2016కు కూడా మరోసారి అదే ఫీట్ ను రిపీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనపడుతోంది.

ప్రియాంక చోప్రా నటిస్తున్న తదుపరి చిత్రం “జై గంగాజల్ – ది ఎండ్ గేమ్” సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసారు. విలక్షణతకు మారుపేరుగా మారుతున్న ఈ అందాల ముద్దుగుమ్మ “జై గంగాజల్” సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. సమాజంలో జరిగే పొలిటికల్ క్రైమ్, అవినీతి, అన్యాయాలను ఒక యువతి ఎలా గాడిలో పెట్టిందనేది చిత్ర మూల కధ. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రియాంక చోప్రా మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకునే విధంగా నటించినట్లు స్పష్టమవుతోంది. ప్రకాష్ జా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2016 మార్చి 4వ తేదీనవిడుదల కాబోతోంది.

ADVERTISEMENT
Latest Stories