యూ ట్యూబ్, ఫేస్ బుక్ అంటే తెలియని తెలుగు హీరో!

r-narayana-murthy would-reject-pawan-kalyan-and-rajinikanths-offerప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న సోషల్ మీడియా అంటే తెలియని వారుంటారా..! ఊహ తెలిసిన పిల్లల దగ్గర నుండి డబ్బై, యనభై ఏళ్ళ ముసలోళ్ళ వరకు ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ ల గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే ఇలాంటి సోషల్ మీడియా మాధ్యమాలంటే తెలియని తెలుగు హీరో ఉంటారా? అంటే ఒకరున్నారన్న విషయం తాజాగా బయటపడింది.

ఎర్ర సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆర్.నారాయణమూర్తి గారికి ఫేస్ బుక్ అనే పేరు కూడా సరిగా తెలియదు. అలాగే యూ ట్యూబ్ అంటే కూడా అదొక వెబ్ సైట్ కింద మాత్రమే పరిచయం. ఇదంతా నమ్మశక్యమా… అంటే నారాయణమూర్తి గురించి తెలిసిన వారికి ఆయన అబద్ధం చెప్పరన్న విషయం తెలిసిందే. తానూ సోషల్ మీడియాను అనుసంధానం చేసుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నానని, అయితే పరిజ్ఞానం పెంపోదించుకోవడానికి సోషల్ మీడియాలో జ్ఞానం పొందాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories