అందరూ చెప్పుకోలేరు… నేను చెప్పుకుంటున్నాను..!

r-narayana-murthy-on-his-movie-theatres-for-sankranthiచిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనే బాధను కొంతమంది నిర్మాతలు బయటకు చెప్పుకోలేరని, కానీ, తాను మాత్రం ఓపెన్ గా చెప్పేస్తున్నానని ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఆయన నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒక మీడియా ఛానెల్ లో మాట్లాడుతూ, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులని, ప్రొడ్యూసర్ల చేతిలోని థియేటర్లు ఉండటంతో ఈ పరిస్థితి నెలకొందని అన్నారు.

పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలలో ఇటువంటి పరిస్థితులు లేవని, అక్కడ చిన్న, పెద్దా సినిమా అనే తేడా లేకుండా, ప్రతి సినిమాకు థియేటర్లు లభిస్తాయని, అటువంటి పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలని కోరుకుంటున్నానని నారాయణమూర్తి పేర్కొన్నారు. మహానటి సావిత్రి తర్వాత అంత గొప్పనటి జయసుధ అని, ఎంతో మంది గొప్ప నటులతో కలిసి ఆమె నటించారని, అటువంటి గొప్ప మహానటితో కలిసి ఈ చిత్రంలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories