రజనీకాంత్ కైనా… పవన్ కళ్యాణ్ కైనా… దండం పెడతా..!

r-narayana-murthy would-reject-pawan-kalyan-and-rajinikanths-offerవిప్లవ చిత్రాల కధానాయకుడు, దర్శకుడు, నిర్మాత… ఇలా ఒకటేమిటి… అన్ని విభాగాల్లోనూ ప్రావీణ్యం సొంతం చేసుకున్న ఆర్.నారాయణమూర్తి పేరు ఎత్తగానే ‘మంచితనం’ తప్ప మరొకటి గుర్తుకు రాదు అంటారు సినీ ప్రముఖులు. ఒకప్పుడు వరుస హిట్లతో కళకళలాడిన అలాంటి నారాయణమూర్తి గారు ప్రస్తుతం ప్రేక్షకుల ఆదరణ చూరగొనడంలో వెనుకబడ్డారు. దీంతో ఆర్ధికంగా కూడా కొంత క్రిందికి దిగారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటుంటాయి.

అయితే ‘టెంపర్’ వంటి చిత్రాలలో కీలక పాత్రల కోసం పూరీ జగన్నాధ్ వంటి దర్శకుడు అడిగిన సమయంలో కూడా నారాయణమూర్తి గారు సున్నితంగా తిరస్కరించారు. ఎలా తిరస్కరించారో కూడా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలో తన గురువు గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తను పోషించిన పాత్ర కోసం మొదటగా తననే అడిగారని, అయితే నాతో ‘ఒరేయ్ రిక్షా’ వంటి సినిమాను తీసిన తన గురువు గారికి ‘నమస్కరించి’ పెట్టి తానూ చేయలేనని అన్నారు.

ADVERTISEMENT

అలాగే తన శ్రేయోభిలాషి అయినటువంటి పూరీ గారు అడిగినపుడు కూడా ఇదే చేసానని… మీరు చెప్తున్నట్లు రజనీకాంత్ గారు నన్ను అడిగినా, పవన్ కళ్యాణ్ అడిగినా… నమస్కరించి చేయలేనని చెప్పడం తప్ప తనకేమి తెలియదని, అయినా వాళ్ళు నన్ను అడగరు, నేను చేయను… రెండు జరగవు అంటూ తనదైన శైలిలో నారాయణమూర్తి గారు తన భావాలను వ్యక్తపరిచారు.

ADVERTISEMENT
Latest Stories