అదొక్కటే కాదు… నాలుగైదు ఎఫైర్లన్న బ్యూటీ..!

Raai Laxmi Opens Up About Her Affair with the MS Dhoniటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని – హీరోయిన్ లక్ష్మీ రాయ్ ల ప్రేమ వ్యవహారం బహిరంగమే. అప్పట్లో ఓ రేంజ్ హంగామా చేసిన ఈ ఉదంతం, ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మను వెంటాడుతూనే ఉంది. సాక్షిని పెళ్లి చేసుకుని ధోని జీవితంలో సెటిల్ అయిపోగా, హీరోయిన్ గా కొనసాగుతోన్న లక్ష్మీ రాయ్ కు మాత్రం, ధోని వ్యవహారంపై ఇప్పటికీ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. తాజాగా “జూలీ 2” ప్రమోషన్స్ లో ఉన్న ఈ బ్యూటీకి ధోనిపై మరోసారి ప్రశ్న ఎదురయ్యింది, దీంతో కాస్త ఆగ్రహంతో కూడిన అసహనం కూడా ప్రదర్శించింది.

ADVERTISEMENT

ధోనీ కాకుండా తాను గతంలో మరో నలుగురైదుగురితో రిలేషన్ షిప్ లో ఉన్నానని, వారు కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారేనని, వారందర్నీ వదిలేసి కేవలం ధోనీ పేరే ఎందుకు పదే పదే ఇంకా ప్రస్తావిస్తున్నారని మీడియా వర్గాలను తిరిగి ప్రశ్నించి షాక్ ఇచ్చింది. టాలీవుడ్, కోలీవుడ్ లలో ఉన్నంతవరకు పెద్దగా నోరు మెదపని లక్ష్మీ రాయ్, బాలీవుడ్ కు చేరగానే బహిరంగంగా అఫైర్ ల గురించి మాట్లాడడం అనేది, బాలీవుడ్ ను బాగా ఆకళింపు చేసుకుందని చెప్పడానికి నిదర్శనమా?! లేక ఎలాగైనా ‘జూలీ 2’ను పబ్లిసిటీ చేయాలనా!

ADVERTISEMENT
Latest Stories