రాశి ఖన్నా మరో అవతారం చూపించింది!

Raashi Khanna Believe in You  Production House“ఊహలు గుసగుసలాడే” సినిమాతో టాలీవుడ్ వెండితెరపై బొద్దు బొద్దుగా కనిపించిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా, ఆ తర్వాత గ్లామర్ డాల్ గా యువతరాన్ని పడేయడంలో విజయవంతమైంది. ‘జిల్’ వంటి సినిమాలలో తన భారీ అందాలను ప్రదర్శించిన ఈ కూల్ బ్యూటీ, హీరోయిన్ అవతారంతో పాటు మరో గెటప్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘బిలీవ్ ఇన్ యూ’ అని గట్టిగా చెప్తోంది.

ADVERTISEMENT

అవును… ఈ టాలీవుడ్ క్రేజీ గర్ల్… హైదరాబాద్ వేదికగా ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మార్చి 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సొంత ప్రొడక్షన్ లో ఓ షార్ట్ ఫిల్మ్ తో ముందుకు రానుంది. “బిలీవ్ ఇన్ యూ” పేరుతో రూపొందించిన ఈ వీడియోకు సంబంధించిన మేకింగ్ వీడియోను తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేసింది.

మహిళా దినోత్సవం తన హృదయానికి చాలా దగ్గరైన రోజని, ఇందుకోసం తన వంతు కృషిగా ఏమైనా చేయాలనుకున్నానని తెలిపిన రాశీ అందులో భాగంగా, తన ప్రొడక్షన్‌ లో ఈ వీడియోను రూపొందిస్తున్నానని పేర్కొంది. మొత్తానికి స్థానిక హీరోయిన్లు కూడా చేయలేని కొన్ని పనులను రాశి అవలీలగా చేసేస్తుండడం విశేషం. ఇప్పటికీ చాలామంది హీరోయిన్లకు హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉందో లేదో గానీ, రాశికి మాత్రం సొంత ఇల్లుతో పాటు సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉండడం చెప్పుకోదగ్గ విషయమే.

ADVERTISEMENT
Latest Stories