రాఘవేంద్రరావు చమక్కులు – ఆమల చిరునవ్వులు!

raghavendra rao soundarya lahari amala akkineni‘మౌనముని’గా పేరుగాంచిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇటీవల ‘సౌందర్యలహరి’తో గళం తన విప్పిన సంగతి తెలిసిందే. ‘బుల్లితెర’పై అయితే చెలరేగిపోయాడు గానీ, పబ్లిక్ ఫంక్షన్లు అయినటువంటి ఆడియో వేడుకలలో మాత్రం రాఘవేంద్రుడు మునుపటి తరహాలోనే కొనసాగారు. అయితే, “సోగ్గాడే చిన్నినాయనా” ఆడియో వేడుకపై మాత్రం ‘మౌనముని’ రెచ్చిపోయారు.

“దసరా బుల్లోడు సినిమాలో నాగేశ్వరరావు గారు కట్టిన పంచెకట్టుకు రెండు రెట్లు ఎక్కువగా నాగార్జున లుక్ ఉందని, దసరా బుల్లోడు కంటే ఈ సినిమా డబుల్ హిట్ అవుతుందని, నాగార్జున చేతిలో ఒక పక్క కర్ర, మరోపక్క ‘బాహుబలి’ శివగామి ఉంది, ఇంకా ‘భలే భలే మగాడివోయ్’ లావణ్య త్రిపాఠి కూడా ఉంది, అలాగే హంసా నందిని కూడా ఉందంటే ఇక ఈ సినిమాకు తిరుగులేదని చెప్పాలి. ఇంత మంది హీరోయిన్లు ఉంటే, నాగ్ ఏం చేస్తారో నాకు తెలుసు, మీకు తెలుసు అంటూ రాఘవేంద్రరావు చేసిన వ్యాఖ్యలకు అభిమానులతో పాటు ‘కింగ్’ భార్య ఆమల ముసిముసి నవ్వులు చిందించడం విశేషం.

కొద్దిగా మాట్లాడినా ఆయన మార్క్ సినిమాల మాదిరే డైలాగ్స్ తో ఫుల్ గా ఎంటర్ టైన్ చేసి వెళ్లారు దర్శకేంద్రుడు. ఇక, సినిమా విడుదల తేదీని జనవరి 15వ తేదీగా ‘కింగ్’ నాగార్జున ప్రకటించడంతో అభిమానులు ఆనందం మరింత రెట్టింపయ్యింది.

ADVERTISEMENT
Latest Stories