సినీ ఇండస్ట్రీ ఎలాంటిదంటే… “మనం ఒంగితే భుజమెక్కుతుంది… మనము ఎక్కితే అది ఒంగుంటుంది…” అని చెప్తున్నారు సింగర్ కం సంగీత దర్శకుడు రఘు కుంచె. ‘నాయకి’ సినిమా విడుదల సందర్భంగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో తన సినీ అనుభవాలను పంచుకున్నారు రఘు. “తన కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డానని, వచ్చిన అవకాశాలు చేజారడం, ఇతనితో పాడిస్తే విజయవంతం కావనే ముద్ర పడటం వంటి ఎన్నో అనుభవాలను చూశానని, అయితే కాలక్రమంలో వాటి నుంచి బయటపడి నిలదొక్కుకున్నానని” చెప్పుకొచ్చాడు.
సినీ ఇండస్ట్రీలో నోటి వరకు వచ్చిన అవకాశాలను చెడగొట్టేవాళ్లు ఉంటారని, ఒక రకంగా ఆదరించే వారి కంటే తొక్కేసే వారే ఎక్కువన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి తరుణంలోనే మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకుంటున్న వారు ఉన్నారని… ఇండస్ట్రీలో ఒక దరిద్రపు అలవాటుందని, ఫలానా వాళ్లు నటిస్తే కలిసొస్తుందని, ఫలానా వాళ్లు పాడితే చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయని… సినీ సెంటిమెంట్లను ఏకరువు పెట్టారు రఘుకుంచె. నిజానికి ఇలాంటి అనుభవాలన్నీ బ్యాక్ గ్రౌండ్ లేని సినీ జనాలకు సర్వసాధారణం అన్న విషయం బహిరంగ సత్యమే.



