దేశ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో పాన్ వరల్డ్ పొలిటీషియన్ గా మారిపోయారు. భారతదేశ రాజకీయాలను ఇక్కడి కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి రాహుల్ చేసే ప్రకటనలకు ఇటు స్వదేశంలోనే కాదు అటు విదేశాల నుంచి కూడా స్పందన ఎదురవుతుంది.
అయితే ఈ స్పందన ఒక్కో సారి రాహుల్ రాజకీయానికి మద్దతు ప్రకటిస్తుంటే, మరోక సందర్భంలో రాహుల్ వ్యాఖ్యల పై విమర్శలు కౌంటర్ల మాదిరి ఎదురవుతున్నాయి. విచిత్రం ఏంటంటే రాహుల్ ప్రకటనలకు విదేశీయుల నుంచి మద్దతు వచ్చినా, అదే విమర్శలు పలకరించినా అవి రాహుల్ కి, కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగానే మారుతున్నాయి.
ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు భారత్ కు వ్యతిరేకంగా పాక్ కు అనుకూలంగా ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ పై మండిపడ్డారు. అయితే వీరి మండిపాటుకు తోడు అటు పాక్ నుంచి రాహుల్ కి మాజీ క్రికెటర్ ఆఫ్రిది నుంచి పెద్ద ఎత్తున ప్రసంశలు దక్కాయి.
దీనితో భారత్ కు పాక్ తో ఎదురవుతున్న సమస్యలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని, రాహుల్ గాంధీ రాజకీయం కూడా భారత్ కు వ్యతిరేకంగా పాక్ కు సానుకూలంగా ఉంటుందంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఆఫ్రిది ప్రసంశలు మరింత మషాలా జోడించినట్టుయింది.
పాకిస్తాన్ నుంచి ఒకరు భారత రాజకీయ నాయకుడి గురించి ప్రశంసించారు అంటే దానిని భారతీయులెవరు సానుకూలంగా తీసుకోలేరు. ఇది రాహుల్ నిబద్ధతను ప్రశినించే స్థాయికి వెళ్ళింది. ఇక తాజగా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు అంశం పై మోడీ పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రాహుల్ ను రాజకీయంగా మరోసారి ఇబ్బంది పెట్టాయి.
ఈ ట్రంప్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని భారత్ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి భయపడుతున్నాడు అంటూ రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్ బెన్ సెటైర్లు వేశారు. మోడీ ట్రంప్ కి భయపడడం లేదు. ఆయన భారతదేశ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ఒక దేశాధినేతగా అమెరికా ప్రయోజనాల కోసం ట్రంప్ ఎలా అయితే వ్యవహరిస్తున్నారో మోడీ కూడా తన దేశాభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దేశాధినేతలు అలానే ఆలోచిస్తారు, ఈ తరహా నాయకత్వం కానీ రాజకీయం కానీ మీకు ఆర్డమవుతాయని నేను అనుకోను, మీకు భారత ప్రధాని అయ్యేంత పటిమ లేదు అంటూ మేరీ తన సోషల్ మీడియా వేదికగా రాహుల్ ను ఉద్దేశించి పోస్టు చేసారు.
దీనితో రాహుల్ గాంధీ ఈ మధ్యన సినీ హీరోల పాన్ ఇండియా స్టార్ మాదిరే పాన్ వరల్డ్ పొలిటికల్ స్టార్ గా మారిపోయారా.? అందుకే రాహుల్ రాజకీయ ప్రకటనల పై ఇటు స్వదేశీయులతో పాటుగా అటు విదేశీయుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో రాహుల్ పై సెటైర్లు పేలుతున్నాయి.






