ఎఫైర్లపై ఆశ్చర్యకరమైన కామెంట్ చేసిన టాలీవుడ్ హీరో!

rajasekhar reveals on relationshipsసినీ ఇండస్ట్రీలో ఎఫైర్ల అంశం ఎక్కువగా హీరోయిన్ల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. హీరోలు కూడా ఇందులో భాగస్వామ్యం అయినప్పటికీ, ఎక్కువగా హీరోయిన్లకే ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కానీ ఈ సారి అందుకు విరుద్ధంగా హీరో రాజశేఖర్ కు ఇలాంటి ప్రశ్న ఎదురయ్యింది. ఒక హీరోను ఈ ప్రశ్న అడగడమే ఒక విశేషం అయితే, దానికి ఆశ్చర్యకరమైన జవాబు ఇచ్చాడు సదరు హీరో. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? ప్రస్తుతం “పీఎస్వీ గరుడవేగ” సినిమాతో మంచి జోరులో ఉన్న రాజశేఖర్.

ADVERTISEMENT

నటి తారాచౌదరితో ఎఫైర్ ఉందా? అంటూ వేసిన ప్రశ్నకు… ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదు గానీ, జీవితతో పెళ్ళికి ముందు తనకు ఎఫైర్లు ఉన్న మాట వాస్తవమే, అలాగే పెళ్లి తర్వాత కూడా మరికొన్ని ఎఫైర్లు ఉన్నాయి కానీ, తారాచౌదరితో తనకు ఎలాంటి ఎఫైర్ లేదంటూ స్పష్టత ఇచ్చారు. తానేమీ రాముడినని చెప్పుకు తిరగడం లేదని రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు వీక్షకులకు షాక్ కు గురి చేయడం విశేషం. తాను చాలా ఫ్రాంక్ గా మాట్లాడతానని చెప్పే రాజశేఖర్, మరీ ఇంత ఓపెన్ గా మాట్లాడతారన్నది మాత్రం ఊహించని అంశం.

ADVERTISEMENT
Latest Stories