సగం గడిచింది…ఇక సర్వం రజనీ పైనే భారం!

Rajinikanth 2.0 Movie  boxoffice collectionsఅనుకున్నదే జరిగిందా…తమిళ తలైవార్ రజనీకాంత్ రోబో 2 . 0 నిర్మాతలకు, ముఖ్యంగా తెలుగు నిర్మాతలకు నష్టాలనే మిగిల్చనుందా? అంటే అవును అని ఒప్పుకోక తప్పదు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. తెలుగులో ఈ సినిమాని ఏకంగా 82 కోట్లకు కొన్నట్లుగా ట్రేడ్ చెబుతున్న మాట.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఇప్పటివరకూ ట్రేడ్ లెక్కల ప్రకారం 33 కోట్ల వసూళ్లు సాధించింది ఈ సినిమా అంటే ఇంకా సగం దగ్గరే నిలిచింది అన్న మాట. ఇక ఈ వారాంతరం మరో మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ కి రావడంతో ఎంత చిన్న సినిమాలు అనుకున్నా కాస్తో కూస్తో థియేటర్స్ ప్రభావం ఉంటుంది అని చెప్పవచ్చు. మరి ఇంకా సగంపైగా వసూళ్లు రాబడితే కానీ నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ అవదు. మరి ఆలా జరగాలి అంటే మరో రెండు మూడు వారాలు అయినా సినిమా భారీ వసూళ్లు సాధించాల్సిందే.

అయితే ఈ క్రమంలో రజనీ మ్యాజిక్ ఎంతవరకూ కలసి వస్తుందో చూడాలి…రజనిపై భారం వేసి…వెయిట్ చెయ్యడం తప్పా ఇక చేసేది ఏమి లేదు.

ADVERTISEMENT
Latest Stories