అంతటా ‘కబాలి’నే… కానీ ‘కబాలి’లోనే ఏమీ లేదు..!

Kabali, Kabali Movie Talk, Rajinikanth Kabali Movie Talk, Superstar Kabali Movie Talk, Kabali Telugu Movie Talk, Kabali Tamil Movie Talk, Kabali Hindi Movie Talk, Kabali Movie Public Talk, Kabali Movie Preview Talkసూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన తరుణం ఆసన్నమైంది. కనివినీ ఎరుగని అంచనాలతో ధియేటర్లలో ‘కబాలి’ సందడి మొదలైంది. ఓ పక్కన టికెట్లు దొరక్క అభిమానులు ఆందోళనలు చేస్తుంటే… మరో పక్కన టికెట్లు దొరికి సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులు మాత్రం ‘కబాలి’ పట్ల నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ‘సూపర్ స్టార్’పై ఎనలేని గౌరవం ఉంది గానీ, ఈ ‘కబాలి’ మాత్రం సంతృప్తిని ఇవ్వలేకపోయింది… అంటూ సోషల్ మీడియాలో తమ అనుభూతులు పంచుకుంటున్నారు.

అర్ధరాత్రి నుండే ‘కబాలి’ హంగామా ప్రారంభం కాగా, మొదట యుఎస్ లో ప్రదర్శితమైన ప్రీమియర్ షోల టాక్ బయటకు రాగా, ఆ తర్వాత తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో వేకువజామున ప్రదర్శితమైన బెనిఫిట్ షోల టాక్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ప్రీమియర్, బెనిఫిట్ షోల టాక్ మరియు సినీ విశ్లేషకులు… సర్వత్రా వ్యక్తపరుస్తున్న అభిప్రాయం ఒక్కటే… మొదటి 15 నిముషాలలో ఆసక్తికరంగా సాగిన సినిమాను ఆద్యంతం అదే విధంగా కొనసాగించడంలో దర్శకుడు రంజిత్ విఫలమయ్యారనేది ముక్తకంఠంగా చెప్తున్నారు.

ADVERTISEMENT

సినిమాలో రజనీ ఎంట్రీ సీన్ మాత్రం ‘కేక,’ సూపర్ స్టార్ కెరీర్లోనే వన్నాఫ్ ది బెస్ట్ ఎంట్రీ సీన్, దీనికి అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా సన్నివేశాన్ని ఎక్కడో నిలబెట్టింది అన్న పాజిటివ్ అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ వయసులోనూ సిల్వర్ స్క్రీన్ పై సూపర్ స్టార్ చెలరేగిపోయిన తీరు రజనీని దైవంగా కొలిచే అభిమాన వర్గాలకు ఖచ్చితంగా నచ్చే అంశమే అయినప్పటికీ, సినిమాను మొత్తంగా చూసుకుంటే… మరోసారి నిరాశ చెందడం తధ్యమన్న టాక్ ను ప్రేక్షకులు వ్యక్తపరుస్తున్నారు.

విడుదలకు ముందు ‘ఎలా ఉంటుందో… ఎలా ఉంటుందో…’ అంటూ ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన ‘కబాలి,’ చివరికి ‘ఇలా ఉందేంటి’ అని అనుకోవడం వీక్షకులకు సహజంగా కలిగే అనుభూతే..!

ADVERTISEMENT
Latest Stories