పవన్ కళ్యాణ్ చిత్రానికి, సూపర్ స్టార్ సినిమాకు లింక్?

Kabali, Kabali Panjaa, Kabali Pawan Kalyan Panjaa, Rajinikanth Kabali Pawan Kalyan Panjaa, Superstar Kabali Pawan Kalyan Panjaaప్రస్తుత సినీ ట్రెండ్ లో ‘కాపీ’ అన్న పదానికి ఆస్కారం లేదు. ప్రేక్షకుడు చూసే ప్రతి సన్నివేశం ఏదొక సినిమాను జ్ఞప్తికి తెస్తూనే ఉంటుంది. అలాగే త్వరలో విడుదల కాబోయే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా “కబాలి” కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “పంజా” సినిమాను ప్రేక్షకులకు గుర్తుకు తెస్తుందని సినీ వర్గాల భోగట్టా. అనాధగా ఉన్న తనను ఓ గ్యాంగ్ స్టర్ పెంచి పోషించడంతో, ఆయనకు కృతజ్ఞత చూపుతూ, గ్యాంగ్ లో కీలక వ్యక్తి తయారైన నేపధ్యంలో… చివరికి తనను ఆదరించిన వ్యక్తినే ఆ అనాథ ఎలా చంపాడు అన్నదే ‘పంజా’ సినిమా కధ.

దాదాపుగా ఇదే లైన్ తో సూపర్ స్టార్ ‘కబాలి’ కూడా సిద్దమైందని, ‘పంజా’ సినిమా ఛాయలుతో పాటు, రజనీ ఆల్ టైం సూపర్ హిట్ చిత్రం “భాషా” సినిమా పోలికలు కూడా ఉంటాయని మరో టాక్. ఏది ఏమైనా గతంలో వచ్చిన గ్యాంగ్ స్టర్ సినిమాలను పోలి ఉంటుందనే టాక్ సూపర్ స్టార్ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా పవన్ ‘పంజా’ దారుణ పరాజయం చవిచూడడంతో… మళ్ళీ అలాంటి కధే అయితే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అన్న టాక్ మొదలైంది.

ADVERTISEMENT

ఇప్పటివరకు పాజిటివ్ గా ‘కబాలి’ రిపోర్ట్స్ విడుదల సమయం దగ్గరవుతున్న కొద్దీ మార్పు రావడం గమనించదగ్గ విషయం. ఇటీవల కాలంలో సెన్సార్ రిపోర్ట్ అంటూ వస్తున్న విషయాలలో వాస్తవాలు ఉండడం లేదని, ఇటీవల విడుదలైన పలు సినిమాల ఫలితాలు నిరూపించడంతో… ‘కబాలి’ కేక అంటూ వ్యక్తమైన సెన్సార్ రిపోర్ట్ లో కూడా వాస్తవం ఎంత ఉందనేది ‘కబాలి’ విడుదలైతే గానీ తెలియదు మరి! ఎలాంటి కాపీ వార్తలు వచ్చినా… రజనీ మేనియాకు మాత్రం తిరుగుండదని ‘కబాలి’ మరోసారి నిరూపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories