ఒక నిబద్దత కలిగిన వ్యక్తి రాజకీయ పదవులలో ఉంటే దాని తాలూకా ఫలితాలు ఎలా ఉంటాయి అనేదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు కూటమి ప్రభుత్వంలో కొందరు నాయకులు. అందులో సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు.
మంగళగిరి లో దశాబ్దాల తరువాత టీడీపీ జెండా రెపరెపలాడించిన లోకేష్ 2019 ఓటమి తాలూకా అవమానం నుంచి 2024 గెలుపు తాలూకా బాధ్యత ను మంగళగిరి ప్రజలకు చేసి చూపిస్తున్నారు. అలాగే తొలిసారి ఎమ్మెల్యే గా తనను అసెంబ్లీ లో అడుగుపెట్టేలా చేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ తన అధికారంతో ఋణం తీర్చుకుంటున్నారు.
కేరళం లో చికిత్స తరువాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన పవన్ రెండు రోజుల పర్యటనకు గాను తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా సుమారు 1500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరపనున్నారు.
అందులో ముఖ్యంగా పిఠాపురంలో 5 ఎకరాల విస్తీర్ణంలో పీఠికాపురవనం ప్రారంభోత్సవం, జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార ప్రాజెక్ట్ పథకం కింద 3O7 కోట్లతో నిర్మించిన మల్టీ విలేజ్ తాగునీటి పథకం జాతికి అంకితం ఇవ్వడం, గొల్లప్రోలులో 80 కోట్లతో వాటర్ వర్క్స్, 200 కోట్లతో పిఠాపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, 100 కోట్లతో నియోజకవర్గంలో అంతర్గత రోడ్ల నిర్మాణం,
ఇక 323 కోట్లతో ఉప్పాడ కోస్టల్ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులు,118 కోట్ల విలువైన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన, మత్స్యకారుల రక్షణ కోసం అధునాతన లైఫ్ జకెట్ల పంపిణి వంటి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇలా పవన్ తన పదవిని, అధికారాన్ని పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చిస్తున్న తీరు హర్షనీయం.
అలాగే అటు రాఖీ పండుగ సందర్భంగా తన నియోజకవర్గ ఆడపడుచులకు సోదరుడి కానుకగా తన తరుపున చీరలు పంపిణి చేసారు, ఇక ఆడవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణమాసం లో ఆఖరి శుక్రవారం మూకుమ్మడి వరలక్ష్మి వత్రాల ఏర్పాటు, అందుకు పుట్టింటి కానుకగా మహిళలకు చీర, పసుపు కుంకుమ అందిస్తూ పిఠాపురంలో తన మార్క్ పాలన సాగిస్తున్నారు పవన్.





