దండయాత్ర షురూ… రాడ్ పట్టుకున్న సూపర్ స్టార్..!

బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతున్నానన్న సంకేతాలను సూపర్ స్టార్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులను నమోదు చేయగా, మరో పక్కన సోషల్ మీడియాలో రిలీజ్ అవుతున్న పోస్టర్లు ఫ్యాన్స్ కు పిచ్చేక్కిస్తున్నాయి. అందులో భాగంగానే లేటెస్ట్ గా విడుదలైన ఓ పోస్టర్ సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది.

రాడ్ పట్టుకుని పరిగెడుతూ ఉన్న సూపర్ స్టార్ సూపర్ ఫోటో అభిమానులకు కావలసినంతా ఉత్తేజాన్ని ఇస్తోంది. ‘లింగా’ సినిమాతో నిరుత్సాహపడిన అభిమానులకు ఒక ఫీస్ట్ ను అందివ్వడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నానన్న సందేశాన్ని సూపర్ స్టార్ ఇస్తున్నారని…. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను పగలకొట్టడానికి రాడ్ పట్టుకుని వస్తున్నారని… ఇలా రకరకాలుగా ఈ పోస్టర్ ను విశ్లేషిస్తూ నెట్టింట్లో అభిమానులు చేస్తున్న కోలాహలం అంతా ఇంతా కాదు.

ADVERTISEMENT

Rajinikanth Kabali, Rajinikanth Mass still, Kabali fight still, Rajinikanth style, Rajinikanth Basha style, Kabali Latest updates

ADVERTISEMENT
Latest Stories