సినీ పరిశ్రమలో సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా రజనీకాంత్ ని చూపిస్తారు. రంగుల కలగా ఉండే సినీ పరిశ్రమలో రజనీ లాంటి వారు ‘యుగానికొక్కడు’ అనే విధంగా ఉంటారు. పలు సందర్భాల్లో ఈ విషయం బహిర్గతం అయ్యింది కూడా. తాజాగా ‘కబాలి’ మేనియాలో అభిమానులు ఊగిపోతున్న తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం అమెరికా వీధుల్లో సింపుల్ గా నడుచుకుంటూ వెళ్తుండడం విశేషం.
కారులో అటుగా వెళ్తున్న ఓ అభిమాని ఆశ్చర్యానికి గురై, వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇంకేముంది ప్రస్తుతం సోషల్ మీడియాలో రజనీ సింప్లిసిటీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కొద్ది సెకన్ల పాటే ఉన్న ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుత యూత్ మాదిరి, తలకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని, రజనీకాంత్ పాటలు వింటూ ప్రపంచంతో సంబంధం లేనట్టు వాకింగ్ చేస్తుండగా… కారులో వెళుతున్న వ్యక్తి రజనీకాంత్ ను గుర్తించి విష్ చేయగా, ప్రతిగా సూపర్ స్టార్ అభివాదం చేయడం విశేషం.



