వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటిస్తూ… హిట్లు మీద హిట్లు అందుకుంటూ… తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ వెంట పడే అభిమానుల సంఖ్య 10 లక్షలకు చేరుకుంది. అయితే ఈ సంఖ్య ఇప్పట్లో ఆగేలా లేదు. ప్రిన్స్ మహేష్ బాబు పక్కన నటిస్తోన్న ‘స్పైడర్’ సినిమా సెప్టెంబర్ నాటికి విడుదల కానుండడంతో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ రకుల్ ఖాతాలో చేరనున్నాయన్న సంకేతాలతో మరింత మంది రకుల్ ను ఫాలో అవ్వడం ఖాయం అంటున్నారు నెటిజన్లు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో రకుల్ ఒకరు. ఇండస్ట్రీలో ఏ ప్రాముఖ్యమైన సినిమా విడుదలైనా… చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పడం… అలాగే తను నటించిన సినిమాలు కాకపోయినా… ‘జై లవకుశ’ వంటి టీజర్, ట్రైలర్లపై తన భావాలు వ్యక్తపరచడం రకుల్ రొటీన్ గా పాటించే విషయాలు. అలాగే ఎప్పటికప్పుడు తన సినీ మరియు జిమ్ కు సంబంధించిన అంశాలను అప్ డేట్ చేస్తూ, నెటిజన్లకు టచ్ లో ఉంటుంది. వీక్షకుల మతిపోయే విధంగా ఇచ్చే ఫోటోషూట్ల క్లిక్స్ దీనికి అదనం.
దీంతో 1 మిలియన్ ఫ్యాన్స్ ఫాలో అవడంలో తప్పు లేదులే! ఈ సందర్భాన్నే ప్రస్తావిస్తూ… తన ట్విట్టర్ కుటుంబం 1 మిలియన్ సంఖ్యకు చేరుకుందని, ఇందులో భాగస్వామ్యులు అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ… అందరికీ ఓ పెద్ద హగ్ ఇస్తున్నాను… అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. తన మాటల ద్వారా ఇండస్ట్రీలోని జనాలనే కాదు, అభిమానులను కూడా ఎలా బుట్టలో వేయాలో రకుల్ కు బాగా తెలిసినట్టుందే అంటున్నారు నెటిజన్లు.



