పాపం రకుల్… తమ్ముడు వలన ఎంత అప్రదిష్ట!

Rakul Preet Singh’s Brother Booked in Hyderabad Drug Case

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ మాదక ద్రవ్యాల కేసులో బుక్ అవడం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని మసాబ్ ట్యాంక్ వద్ద మాదక ద్రవ్యాలు చేతులు మారుతుండగా పోలీసులు, ఈగల్ టీమ్‌ రెడ్ హ్యాండడ్‌గా కొందరిని పట్టుకున్నారు.

ఆ తీగ లాగితే మరో ఇద్దరు వ్యాపారులు, వారి వద్ద 43 గ్రాముల కొకైన్ దొరికింది. వారిని ప్రశ్నిస్తే అమన్ ప్రీత్, మరో నలుగురు వ్యక్తుల పేర్లు బయటకొచ్చాయి. పోలీసులు, ఈగల్ టీమ్‌ తమ కోసం గాలింపు మొదలుపెట్టినట్లు పసిగట్టడంతో అమన్ ప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

ADVERTISEMENT

నిత్యం అనేక కేసులు, విచారణలు, జైలు, బెయిలు కధలు చూస్తున్న ఏపీ ప్రజలకు తర్వాత కధ ఎలా సాగుతుందో, క్లైమాక్స్ ఎలా ఉంటుందో చాలా సులువుగా చెప్పేయగలరు. కనుక అందరికీ తెలిసిన ఆ స్టోరీ ఇప్పుడొద్దు.

కానీ ఢిల్లీలో పంజాబీ కుటుంబం నుంచి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ కోసం ఎంత శ్రమించింది? తర్వాత అగ్రస్థాయికి చేరుకోవడానికి మరెంతగా శ్రమించింది?

ఇంత పేరు ప్రతిష్టలు ఆర్జించిన ఆమెకు తన వలన తల దించుకునే పరిస్థితి కల్పించడం న్యాయమేనా? అని అమన్ ప్రీత్ సింగ్ ఒక్కసారి ఆలోచించి ఉండాలి కదా? ఎక్కడి నుంచో వచ్చి ఆమె నిలద్రొక్కుకోవడమే కాక అతనికి కూడా సినిమా అవకాశం ఇప్పించింది. కానీ మగాడినని గర్వపడే అమన్ ప్రీత్ సింగ్ సొంతంగా దారి చేసుకొని ఆమె స్థాయికి ఎదగలేకపోగా మాదక ద్రవ్యాల ఊబిలో కూరుకుపోవడం చాలా శోచనీయం.

ఒకప్పుడు అనేక సినిమాలు చేసి తర్వాత వివిధ కారణాల వలన అవకాశాలు రానివారు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.

వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా ఫ్లాపులతో బాధపడే వారూ ఉన్నారు. ఎంతో పేరు ప్రతిష్టలు, డబ్బు ఆర్జించినా సకాలానికి సినిమాలు రిలీజ్ చేసుకోలేక ఇబ్బంది పడినవారు కూడా ఉన్నారు.

డైవోర్స్ తీసుకొని తీవ్ర మనోవేదనకు, సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురవుతున్న బాధితులు కూడా సినీ పరిశ్రమలోనే ఉన్నారు.

ఒక్క సినీ పరిశ్రమలోనే ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నవారున్నారు. కానీ వారందరూ ఇలా మాదకద్రవ్యాలకు బానిసలు కాలేదు. కానీ సరదాగా లేదా వేరే కారణాలతో మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నవారు కూడా ఉన్నారని అమన్ ప్రీత్ సింగ్ ద్వారా మరోసారి స్పష్టమైంది.

ADVERTISEMENT
Latest Stories