ఈ సీన్లు చూస్తే ‘అతడు’ డైలాగ్ గుర్తుకు రావాల్సిందే!

rakul-preet-singh-f45-gym-workoutత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “అతడు” సినిమాలో… ‘వీడు ఒలంపిక్స్ కు వెళితే ఇండియాకు గోల్డ్ మెడల్ వచ్చేది’ అని ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ గుర్తుందా..! ప్రస్తుతం మన ముద్దుగుమ్మలను చూస్తుంటే కూడా అలాంటి డైలాగ్సే అనాలని ఉండడం సహజమే!

ఇటీవలే టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత 100 కేజీల బరువును అవలీలగా ఎత్తి సత్తా చాటగా, ఇప్పుడిప్పుడే టాప్ హీరోయిన్ జాబితాలో చేరుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఓ వీడియో తాజాగా హల్చల్ చేస్తోంది. ‘తమ్ముడు’ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ చేసిన ఫీట్లు మాదిరి జిమ్ లో రకుల్ దర్శనమిస్తోంది.

ADVERTISEMENT

హీరో రానాతో పోటీ పెట్టుకుని ఓడిపోయిన వీడియో కూడా హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలు చూస్తుంటే… వీరేనా వెండితెరపై అందాలు ఆరబోసే సుకుమారమైన ముద్దుగుమ్మలు అనిపించక మానదు.

ADVERTISEMENT
Latest Stories