అది మధురమైన అనుభూతి!…హాట్ హీరోయిన్!

rakul preet singh likes challenges ఆమధ్య చేతిలో సినిమాలు ఏమీ లేక ఖాళీగా ఉంటూ హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసుకుంటూ, మరో పక్క జిమ్ లో వర్కౌట్స్ చేసుకుంటూ కాలం గడిపిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఏకంగా మూడు బాషల్లో…నాలుగు సినిమాల్లో నటిస్తుంది. అందులో ఒకటి హింది సినిమా కాగా, మరొకటి తమిళ సినిమా, ఇంకొకటి తెలుగు..ఇక హిందీలో ఈ భామ సిద్దార్ధ మల్హోత్రాతో కలసి నటుస్తూ ఉండగా…తమిళ్ లో శివకార్తికేయన్ తో నటిస్తుంది. ఇక తెలుగులో మన యువ సామ్రాట్ నాగ చైతన్యతో బాబీ తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్లో కనిపిస్తూనే, మరో పక్క ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రల్లో ఒదిగిపోనుంది.

[m9ad]

ADVERTISEMENT

ఇదిలా ఉంటే మూడు సినిమాలో ఒకేసారు, పలు రకాల బాషల్లో సినిమాలు చెయ్యడం ఇబ్బందిగా లేదా అని అడిగితే ఇవన్నీ అసలు నేను ప్లాన్ చేసుకున్నవి కావి, ఫ్లో లో వచ్చే వాటితో మనం ఫాలో అయిపోవడమే. అయితే మూడు బాషల్లో, రకరకాల సెట్స్ లో, బ్యాక్టూ బ్యాక్ ప్రయాణం చేస్తూ నటించడం కాస్త కష్టం అయిన పనే…కానీ అలాంటి చ్యాలెంజింగ్ సంధర్భాలంటే నాకు చాలా ఇష్టం…ఎందుకంటే పని విషయంలో నేను పెద్దగా అలసిపోను…నన్ను నమ్మి అలాంటి ప్రాధాన్యతతో కూడిన ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, ఇంకో ఆడుకు ముందుకు వేసి, నేను ఇంకాస్త కష్ట పడటంలో తప్పు ఏముంది అంటుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక వివిధ బాషల్లో నటించడం, రకరకాల ఆర్టిస్ట్స్తో కలసి పని చెయ్యడం నిజంగా మంచి అనుభవం అని అంటుంది ఈ భామ. మొత్తంగా చూసుకుంటే ఆ మధ్య పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యీ, హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషియల్ మీడియాలో కుర్ర కారుకు మత్తెక్కిస్తూ కాలం గడిపిన ఈ భామ మరో మారు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.

ADVERTISEMENT
Latest Stories