మహేష్ బాబుకు, రకుల్ ప్రీత్ పెళ్ళికి ఉన్న సంబంధం!

rakul preeth singh reveals about her marriage‘సరైనోడు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రకుల్ ప్రీత్ ‘మెగా’ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇప్పటికే రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’తో ఒక సినిమా చేసేసిన రకుల్, తాజాగా ‘ధృవ’ సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే, మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తోనూ ఓ సినిమా చేస్తున్న రకుల్, మెగా వారసుడు వరుణ్ సినిమాకు కూడా పని చేస్తోందన్న వార్తలు హల్చల్ చేసాయి.

ADVERTISEMENT

ఇలా తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ని ‘పెళ్ళెప్పుడు?’ అంటూ ఒక విలేఖరి పలకరించాడు. అయితే అందరి హీరోయిన్ల మాదిరి కాకుండా రకుల్ మాత్రం ఓ వెరైటీ సమాధానం ఇచ్చింది. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు హీరోయిన్లకు ఎదురుకావడం ఎంత సాధారణమో… ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి, పెళ్లి ఊసు ఇప్పట్లో లేదు, చేసుకున్నా అందరికీ చెప్పే చేసుకుంటాను… అంటూ ముద్దుగుమ్మలు బదులివ్వడం కూడా అంతే సాధారణం.

కానీ, రకుల్ మాత్రం, “టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసిన తర్వాత మాత్రమే తన వివాహం గురించి ఆలోచిస్తాను” అంటూ ఓ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో తొలుత రకుల్ ప్రీత్ సింగ్ నే ఎంపిక చేయగా, ‘నాన్నకు ప్రేమతో’ సినిమా షెడ్యూల్ రీత్యా, మహేష్ సినిమా నుండి తప్పుకుంది. దీంతో ప్రిన్స్ తో నటించే మరో అవకాశం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడడం రకుల్ వంతయ్యింది. ఈ క్రమంలోనే తన జీవిత లక్ష్యంగా ప్రిన్స్ సినిమాను అభివర్ణించింది.

ADVERTISEMENT
Latest Stories