సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తనివొరువన్’ తెలుగు రీమేక్ “ధృవ” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గతంలో లేని విధంగా ఈ సినిమా షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ కోవలోనే మరో చెర్రీ ఫోటో నెటిజన్లను మరియు పెట్ ప్రియులను ఆకర్షిస్తోంది. ‘రాయల్ ఎన్ ఫీల్డ్’పై కుక్కను పట్టుకుని ఉన్న రామ్ చరణ్ ఫోటో అభిమానులకు కన్నుల పండుగగా ఉంది.
కొత్త లుక్ లో రామ్ చరణ్ అభిమానులకు కనువిందు చేస్తుండగా, క్యూట్ క్యూట్ గా ఉన్న కుక్క పెట్ ప్రియులను ఆకర్షిస్తోంది. ‘ధృవ’ సినిమా సెట్స్ నుండి వచ్చిన ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్ చిత్ర బృందం షాట్ కు రెడీ అవుతున్నట్లుగా కనపడుతోంది. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ADVERTISEMENT
ADVERTISEMENT



