‘ధృవ’ సినిమా కోసం కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మెగా వారసుడు రామ్ చరణ్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఈ సినిమా కోసం చెర్రీ తన లుక్ ను మార్చిన విషయం తెలిసిందే. ఫుల్ షేవింగ్, మీసకట్టుతో పోలీస్ పాత్రలో నటిస్తున్న చెర్రీ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో సందడి చేయగా, తాజాగా హైదరాబాద్ లో దిగిన సందర్భంలో రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి.
ADVERTISEMENT
బ్లూ షర్టు, క్యాప్, గాగుల్స్ తో రామ్ చరణ్ స్టైలిష్ గా కనపడుతున్నాడు. సింపుల్ కాస్ట్యూమ్స్ అయినప్పటికీ చెర్రీ అయిన మేకోవర్ మరియు ఓ బ్యాగ్ పట్టుకుని స్టైల్ గా నడుస్తున్న తీరు వీక్షకులను ఆకట్టుకుంటోంది. తాజా ఫోటోల సందడితో ‘ధృవ’ సినిమాలో మునుపెన్నడూ లేనంత అందంగా చెర్రీ కనపడనున్నాడని ఖరారవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
ADVERTISEMENT



