‘ప్రజారాజ్యం’ మిస్సయ్యింది… ‘జనసేన’ను వదలను..!

Ram-Charan---Jana-Sena-Pawan--Kalyan“రంగస్థలం” సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న చెర్రీ, రాబోయే ఎన్నికలలో ‘జనసేన’ తరపున ప్రచారం నిర్వహిస్తానని స్పష్టమైన ప్రకటన చేయడం మెగా అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

నిజానికి తాను “ప్రజారాజ్యం” సమయంలోనే ప్రచారానికి బరిలోకి దిగాల్సి ఉందని, చేయాలన్న ఆసక్తి తనలో కూడా ఉందని, కానీ అప్పుడు బాబాయ్ పవన్ కళ్యాణ్ వద్దని తనకు చెప్పారని, దీంతో తాను ఆగిపోయానని తెలిపారు. అయితే ప్రస్తుతం బాబాయ్ పవన్ కళ్యాణ్ ఒక్కరే ఎంతో కష్టపడుతున్నారని, దానిని చూసి నేను కూడా ఎంతో కొంత జనసేనకు చేయాలని ఉందని అన్నారు.

ADVERTISEMENT

సమయం వచ్చినపుడు బరిలోకి దిగడానికి తాను సిద్ధమేనని స్పష్టం చేసిన రామ్ చరణ్ వ్యాఖ్యలతో ‘జనసేన’కు మెగా కాంపౌండ్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టమైంది. తన అన్నయ్యను విభేదించి మరీ తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్తూ వచ్చిన పవన్, ఇక నుండి అలాంటి డైలాగ్స్ కు ఆస్కారం ఇవ్వకపోవచ్చు. ఏది ఏమైతేనేం… జనసేన విషయంలో మెగా ఫ్యామిలీ ఒక్క తాటిపైకి వస్తుండడం అభిమానులకు ఆనందదాయకంగా మారింది.

ADVERTISEMENT
Latest Stories