తిరిగి ఇచ్చేయాలి… లేకపోతే లావైపోతారు… ఇది మహేష్ ‘శ్రీమంతుడు’ సిద్ధాంతం. సరిగ్గా దీనినే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాటించాడు. ‘రంగస్థలం’ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు అక్కడికి వెళ్ళిన విషయం, ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియోలో స్పష్టమైంది. చెర్రీ నటిస్తుండగా, మానిటర్ వైపు చూస్తున్న ప్రిన్స్ స్టిల్ సోషల్ మీడియాలో సందడి చేసిన వైనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ADVERTISEMENT
ఇక తాజాగా ‘భరత్ అనే నేను’ మేకింగ్ విజువల్స్ ను రిలీజ్ చేసారు. ఈ సెట్స్ లో రామ్ చరణ్ తేజ్ కనిపించడం అసలు విషయం. అసెంబ్లీ సన్నివేశాలు షూటింగ్ చేస్తోన్న సమయంలో రామ్ చరణ్, సుకుమార్ లు ఉండడం ఈ వీడియోలో స్పష్టమైంది. తాజాగా దీనికి సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట హంగామా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో మహేష్ – చెర్రీల ద్వయం ఎక్కువగా కనపడుతుండడం అభిమానులకు కన్నులవిందును పంచుతోంది.
ADVERTISEMENT



