“చవకబారుతనం” అన్న మెగా వారసుడు!

Ram-Charan-Strong-Counter-to-Sri-Reddy‘కాస్టింగ్ కౌచ్’లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వచ్చిన విమర్శలకు పవన్ పెదవి విప్పలేదు గానీ, ఉదయం మెగా సోదరుడు నాగబాబు ఫైర్ అయిన విషయం తెలిసిందే. అలాగే సాయంత్రం సమయానికి మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ రంగంలోకి దిగాడు. ఎవరి పేర్లు ప్రస్తావించలేదు గానీ, బదులు మాత్రం కాస్త గట్టిగానే ఇచ్చారు.

“అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉంటే వాటిని న్యాయబద్ధంగా, సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలి. అయితే కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్దాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడడం చవకబారుతనంలా ఉంటుందని” సందేశం ఇచ్చారు.

ADVERTISEMENT

ఈ మెస్సేజ్ ఎవరికీ తగాలలో వారికీ ఖచ్చితంగా తగిలే ఉంటుంది. అయితే అప్పటికే శ్రీరెడ్డి వెనక్కి తగ్గి, పవన్ సూచనలను పాటిస్తానని, తనది తప్పయిపోయిందని, పవన్ తల్లిని క్షమాపణలు కోరారు. దీంతో కాస్టింగ్ కౌచ్ అంశంలో పవన్ కళ్యాణ్ పేరుతో సాగిన డ్రామాకు తెరపడినట్లయ్యింది. దీంతో పవన్ ఫ్యాన్స్ కూడా ఊరట చెందారు.

ADVERTISEMENT
Latest Stories