వైసీపీ మంత్రి పేర్ని నానితో సినిమా టికెట్ ధరల అంశంపై చర్చించడానికి వెళ్లిన రాంగోపాల్ వర్మ గెటప్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. రెడ్ జాకెట్, చిరిగిపోయిన జీన్స్, గోల్డ్ కలర్ బూట్లు ధరించిన వర్మ వస్త్ర ప్రదర్శన చిత్ర విచిత్రంగా ఉండగా, తాను ఎందుకు అలా ధరించాల్సి వచ్చిందనే దానిపై ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు వర్మ.
ఈ ఇష్యూ అంతా నేను వోడ్కా తాగుడుతో స్టార్ట్ చేసా, దాని తర్వాత అమ్మాయిలతో డాన్స్ వేస్తా, నేల మీద పొర్లుతా… ఇవన్నీ చేసినంత మాత్రాన మీ దగ్గర నాలెడ్జ్, తెలివి లేదు అనుకోకండిరా సుబ్బారావు గారు అని చెప్పడానికి చేసా. పాయింట్ నెంబర్ 1 అది. ఇక పాయింట్ నెంబర్ 2 ఏమిటంటే, మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తా కూడా సీరియస్ గా ఉండొచ్చు.
మీరు తెల్లబట్టలేసుకుని మంచిగా మాట్లాడినంత మాత్రాన మీకు తెలిసినట్లు కాదు, ఈ గోల్డ్ షూస్ వేసుకుని వోడ్కా తాగి అమ్మాయిల కాళ్ళకు దండం పెడతా నేల మీద పొర్లినంత మాత్రాన తెలియదని కాదు… ఈ రెండింటిని కలపకండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి అలా వెళ్లినట్లుగా రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.
మరి వర్మ ఆహార్యం చూసి సెక్రటేరియట్ స్పందన ఏమిటి అంటే… మంత్రి నాని అయితే ‘మనసుకు మేకు కొట్టారు’ అని తన ప్రదర్శనపై కామెంట్ చేసినట్లుగా వర్మ తెలిపారు. ముందుగా నాని అన్నది అసలు నాకు అర్ధం కాలేదని, తన బట్టలపై కామెంట్ చేసారని కూడా తెలియదని, అలాంటి మాటలు ఎప్పుడూ తాను వినలేదని వర్మ చెప్పిన కబుర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
😂😂😂 pic.twitter.com/iVURJFOV0W
— Journey with Jogu (@JogulambaV) January 11, 2022



