పవన్ కళ్యాణ్ నిద్రపోతున్న ‘అగ్ని పర్వతం’ లాంటోడు!

ram-gopal-varma-tweet-on-pawan-kalyanఒక వ్యక్తిని ఎప్పుడు లేపాలో, ఎప్పుడు పడుకోబెట్టాలో దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలిసినంతగా మరో వ్యక్తికి తెలియదని చెప్పడంలో సందేహం లేదు. తన ‘వంగవీటి’ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న తరుణంలో… మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా వర్మకు సడెన్ గా ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చినట్లున్నారు. ఎవరి ఫ్యాన్స్ తో అయితే వర్మ ఎక్కువగా టచ్ లో ఉంటారో, మళ్ళీ ఆ వ్యక్తి గురించే తాజాగా ఓ ట్వీట్ చేసారు.

అయితే ఈ సారి ఫుల్ ‘పాజిటివ్’గా..! ‘పవన్ కళ్యాణ్ నిద్రపోతున్న అగ్ని పర్వతం లాంటోడు, అప్పుడప్పుడూ గుడగుడలాడుతూ పొగలు వదులుతూ ఉంటాడు… టైం వచ్చినపుడు పేలతాడు…’ అంటూ ఓ ట్వీట్ చేసారు. సమయం, సందర్భం లేకుండా ఒక్కసారిగా పవన్ పై ఇంతగా ఎందుకు ప్రేమ కురిపించారు అని వర్మ అనుకుంటున్నారా… సమాధానం కూడా మీకు తెలిసే ఉంటుందిలేండి..! పవన్ సామాజిక వర్గానికి చెందిన “వంగవీటి” సినిమా విడుదల కానున్న నేపధ్యంలో… పవన్ ను ఆకాశానికేత్తేసాడు వర్మ.

ADVERTISEMENT

మరి సినిమా విడుదలై ఓ రెండు, మూడు రోజులు గడిచిన తర్వాత ఇదే వర్మ, మళ్ళీ పవన్ ను విమర్శించే వ్యక్తులలో ముందుగా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఈ మధ్యలో పవన్ ఏదైనా ఓ రెండు అవగాహనా రాహిత్యపు ట్వీట్లు చాలు… వర్మ ఏకిపారేయడానికి..! అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎవరైనా ముందుంటారు, కానీ సృష్టించుకోవడం వర్మకు మాత్రమే తెలిసిన విద్య. అందుకే భారతీయ సినీ పరిశ్రమకు ఒకే ఒక్క “వర్మ” ఉన్నాడు.

ADVERTISEMENT
Latest Stories