ప్రవీణ్ సత్తారు – కొత్తది మొదలెట్టారు

Ram Pothineni - Praveen Sattaru ఎనర్జెటిక్ స్టార్ రామ్ – దర్శకుడు ప్రవీణ్ సత్తారు కలయిక లో,రామ్ సొంత బ్యానర్ – స్రవంతి మూవీస్ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. యాక్షన్, అడ్వెంచరస్ జర్నీగా.. ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. గరుడ వేగ విజయం తో ఆనందం లో ఉన్న ప్రవీణ్ సత్తారు, రామ్ కోసం ఈ కథని చాలా కస్టపడి తయారు చేశానన్నాడు. ప్రవీణ్ విజయ గర్వం, ధనాపేక్ష లేకుండా.. మంచి కథ కోసం ఇన్ని రోజులుగా వేచి చూశాడట.

ఈ సినిమా లో గ్రాఫిక్స్ కూడా ఎక్కువే వాడుతారని.. ప్రీప్రొడక్షన్ పనులు చాలా జాగ్రత్తగా పూర్తిచేశారు. హిట్ ఇచ్చి చాలా రోజులైన రామ్ కు.. ప్రవీణ్ సత్తారు ఖచ్చితంగా హిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. రామ్ ప్రవీణ్ నే నమ్మి కూర్చున్నాడు. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమాకు మిగిలిన నటీనటులు, సాంకేతికనిపుణులు ఖరారు కాలేదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories