విమర్శకులకు రమా రాజమౌళి ఛాలెంజ్!

Ram Rajamouli Interview Baahubali 2‘దర్శకధీరుడు’ రాజమౌళి సతీమణిగా సగటు సినీ ప్రేక్షకులకు సుపరిచితం అయిన రమా రాజమౌళి, ‘బాహుబలి’ సినిమాతో వ్యక్తిగతంగా కూడా ఖ్యాతిని ఆర్జించారు. అలాగే ఈ నెల 28వ తేదీన విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ ఇంకెంతటి స్థాయికి చేరుకుంటారో గానీ, ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ మొత్తం బిజీగా ఉంది. అందులో భాగంగానే రమా రాజమౌళి ఓ వెబ్ మీడియాతో తన సినీ, వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.

రాజమౌళి సినిమాలంటే… తన కుటుంబ సినిమాలుగా మారిపోయాయని, ముఖ్యంగా ఇటీవల జరిగిన ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్, రాజమౌళి ఫ్యామిలీ ఈవెంట్ గా మారిపోయిందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్న నేపధ్యంలో… ఈ ప్రశ్నకు కాస్త గట్టిగానే బదులిచ్చారు రమా. ‘నేను చేసినంత పని… నేను ఛాలెంజ్ చేయగలను… ఇతరులు అలా కష్టపడలేరు…’ అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడిన రమా, ఆ తర్వాత కాస్త స్థిమితంగా స్పందించారు.

ADVERTISEMENT

మా కుటుంబంలోనే అత్యున్నత నైపుణ్యం ఉండగా, ఇతర వ్యక్తులను తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని విమర్శలపై గట్టిగా స్పందించారు. ఒక్క హీరో ప్రభాస్ మినహా హీరోయిన్లు కూడా అందరూ ఎవరి సినిమాలు వారు చేసుకున్నారని, ప్రభాస్ మాత్రం అంతలా కష్టపడ్డారని చెప్పారు. సినిమా ధ్యాసలో ఉంటే తనేం చేస్తారో కూడా తనకు తెలియదని, ఒకసారి ఎవరో ఇంటికి వెళ్లి తన ఫోన్ అనుకుని, టీవీ రిమోట్ ను జేబులో పెట్టుకుని వచ్చేశారని, అలాగే ఓ సారి కారు తాళాలు తెచ్చేసారని రాజమౌళి గురించి చెప్పుకొచ్చారు రమా.

ADVERTISEMENT
Latest Stories