ఏపీలో పోలీసు సిత్రాలు…. మాములుగా లేవుగా… !

Ramgiri Police constablecomplaints on paritala sriramరామగిరి పోలీసు స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ యువనేత పరిటాల శ్రీరామ్ పై ఒక కేసు నమోదు అయ్యింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజశేఖరరెడ్డి కి సంబంధించిన విగ్రహాన్ని పది నిముషాలలో పడగొడతామని పరిటాల శ్రీరామ్ ఒక కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ADVERTISEMENT

ఈనాడులో వచ్చిన ఒక న్యూస్ రిపోర్టు ప్రకారం…దీనిపై కేసు నమోదు అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినేలా శ్రీరామ్ వ్యాఖ్యలు ఉన్నాయని కేసు కట్టారు. సరే నిజమే… అయితే ఈ కేసు ఎవరు నమోదు చేసారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.

ఈ కేసు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినేలా ఉందని రామగిరి స్టేషన్ లో పని చేసే కానిస్టేబుల్ మల్లికార్జున రెడ్డి ఫిర్యాదు చేశాడట. కానిస్టేబుల్ మల్లికార్జున రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు కట్టామని రామగిరి పోలీసు స్టేషన్ ఎస్ఐ నాగస్వామి మీడియాకు చెప్పడం విశేషం.

సహజంగా ఒక కేసులో పోలీసుల సాక్ష్యమే కోర్టు పరిగణలోకి తీసుకోదు. అటువంటిది పోలీసులే కంప్లయింట్లు ఇచ్చేసుకుని, వారే కేసులు నమోదు చెయ్యడం ఏంటో? అసలు ఒక పార్టీ కార్యకర్తల మనోభావాలు గాయపడతాయని కానిస్టేబుల్ బాధ పడటం ఏంటో? ప్రజల కోసం పని చేస్తున్నారో పాలకుల కోసం పని చేస్తున్నారో తెలియని పరిస్థితి.

ADVERTISEMENT
Latest Stories