తిక్కవరపా మజాకా… చిరుకు కూడా తప్పలేదు..!

Ranveer Singh chiranjeevi Dances at TSR Partyఒక రాజకీయ నాయకుడిగా కంటే, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా టి.సుబ్బిరామిరెడ్డి అందరికీ సుపరిచితం. కళాకారులకు అవార్డులు ఇవ్వడం దగ్గర నుండి ప్రతిభా పురస్కారాలు, దిగ్గజ సినీ సెలబ్రిటీలకు సన్మానాలు ఇలా ఏ విధంగా చూసినా సుబ్బిరామిరెడ్డి పేరు టాలీవుడ్ లో ఎప్పుడూ హల్చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా కూడా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి తన మనవడి పెళ్లికి సంబంధించిన సమాచారంతో వార్తల్లో నిలిచారు.

తన సొంత ఇంటి వేడుక మెగాస్టార్ కూతురు వివాహానికి కూడా హాజరు కానటువంటి పవన్ కళ్యాణ్ స్వయంగా సుబ్బిరామిరెడ్డి ఇంట వేడుకకు హాజరయ్యారంటే… ఏ రేంజ్ లో తిక్కవరపు ప్రభావం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఈ వేడుకకు సంబంధించిన సంగీత్ కార్యక్రమాలలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు వేయడం ఫ్యాన్స్ ను అవాక్కు చేస్తోంది. చిరు లాంటి వ్యక్తి సాధారణంగా ఒక స్టేజ్ పై స్టెప్పులు వేయరన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

అలాంటి చిరంజీవి కూడా సుబ్బిరామిరెడ్డితో ఆడిపాడుతూ, సంగీత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే చిరు స్టెప్పులు చూసిన బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ కూడా చిరుకు జత కలిసి వేడుకపై చిందులు వేసారు. ఈ దిగ్గజ సెలబ్రిటీల హంగామాతో వేడుకంతా కళకళలాడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సదరు వీడియో వీక్షకుల కోసం…

ADVERTISEMENT
Latest Stories