జబర్దస్త్’ బ్యూటీ చెప్పిన ‘తుంటరి’ జవాబులు!

Rashmi Gautamటాలీవుడ్ హాట్ అండ్ ‘జబర్దస్త్‌’ యాంకర్‌ రష్మి ట్విట్టర్‌లో ముచ్చటిస్తూ… నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో తుంటరి జవాబులు చెప్తూ సందడి చేసింది. రష్మీ ఎప్పుడు చాట్‌ చేసినా ‘జబర్దస్త్’ సుధీర్‌ గురించి ప్రశ్నలు రావడం మాత్రం ఆగడం లేదు. బుల్లితెరపై సుధీర్‌ – రష్మీల జంట ప్రేమికులుగా నటిస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

‘సుధీర్‌ మీకు ప్రపోజ్‌ చేశారు కదా? ఎందుకు అప్పుడు సమాధానం చెప్పలేదు?’ అని ఓ అభిమాని ప్రశ్నించగా, ‘అది నా ఇష్టం’ అంటూ ఈ బ్యూటీ పేర్కొని షాక్ ఇచ్చింది. ‘ప్రోగ్రాంలో ప్రపోజ్‌ చేశాడు కదా… అలా అడిగినందుకు క్షమించండి?’ అని మళ్లీ ఓ కామెంట్‌ చేయగా, ‘మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది… ‘ప్రోగ్రామ్‌లో’ అంటే తెరపైన’ అని సమాధానం ఇచ్చింది.

‘సుధీర్‌ నిన్ను నిజంగా ఇష్టపడుతున్నాడు?’ అని అడగగా ‘ఆయన మీకు చెప్పారా?’ అంటూ రష్మీ ప్రశ్నించింది. ఒక నెటిజన్‌ ‘రష్మి నీ పెళ్లెప్పుడు? అని అడగగా ‘నా పెళ్లి ఖర్చు మీరు పెట్టబోతున్నారా?’ అని ఎదురు ప్రశ్నించింది. ‘సినిమాల్లో మీరు కనిపించడం లేదు ఎందుకని?’ అని ఒకరు ప్రశ్నించగా… ‘చేయట్లేదు కాబట్టి’ అని తుంటరి జవాబిచ్చింది.

‘సినిమాల్లో మీరు నటించడం లేదా? లేక తీసుకోవడం లేదా?’ అని ఓ నెటిజన్‌ అడగగా ‘తీసుకోవడం లేదు’ అంటూ ముక్కుసూటిగా చెప్పేసింది. సుధీర్ తో పెళ్లి అన్నందుకే ఇటీవల ఓ నెటిజన్ కు రష్మి క్లాస్ పీకిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా మళ్ళీ సుధీర్ గురించి ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉండడం అనేది, వీరిద్దరూ ఎంతగా ఫేమస్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories