రష్మి… సుధీర్… ఒకేసారి వివాహం..!

Rashmi Gautam-బుల్లితెరపై నిత్యం వినోదాన్ని అందిస్తూ సందడి చేసే రష్మి – సుధీర్ జంటపై పుట్టుకొచ్చిన వార్తలు, బహుశా మరే జంటపై వచ్చి ఉండవ్. వీరిద్దరూ అనేక సందర్భాలలో తమపై వచ్చిన వార్తలను ఖండిస్తూ వివరణ ఇచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత మళ్ళీ ఏదొక కార్యక్రమంలో జంటగా కనిపిస్తుండడంతో, ఫ్రెష్ గా పుకార్లు రావడం సర్వసహజం అయిపోయాయి.

[m9ad]

ADVERTISEMENT

అయితే వీటికి శుభంకార్డు వేస్తూ ఓ మార్గాన్ని చెప్పుకొచ్చింది రష్మి. “నేను ముందుగా పెళ్లి చేసుకుంటే సుధీర్ ని మోసం చేశానని చెప్పుకుంటారు. తను ముందు పెళ్లి చేసుకుంటే నాకు ద్రోహం చేశాడని అనుకుంటారు. అందువలన పక్క పక్కనే చెరో వేదికపై ఒకేసారి పెళ్లి చేసుకుందామని నేను సుధీర్ తో చెబుతూ వుంటాను” అంటూ చమత్కరించింది.

ADVERTISEMENT
Latest Stories