ఇంతకీ ఈ విషయం రాజమౌళికి తెలుసా?

Rashmika to romance ram charan in RRRటాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి ఏం చేసినా సంచలనమే. తన తోలి సినిమా నుంచి ఇప్పటివరకూ చిన్న ప్లాప్ కూడా లేకుండా దూసుకెళ్తున్న జక్కన్న రాజమౌళి తాజాగా జూనియర్ నందమూరి తారక్, జూనియర్ మెగాస్టార్ రాంచరణ్ తో ‘ఆర్.ఆర్.ఆర్’ పేరుతో టాలీవుడ్ లో భారీ ముల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఈ క్రమంలో సినిమా షూటింగ్ మొదలయ్యి రెండు రోజులు కూడా కాలేదు, బహుశా రాజమౌళికి కూడా తెలుసో లేదో, ఇక నిర్మాత దానయ్యకు అయినా చెప్పారో లేదో కానీ, ఈ సినిమాలో అప్పుడే చెర్రీ సరసన చలో, గీత గోవిందం, దేవదాస్ సినిమాల్లో నటించింది రష్మిక నటిస్తుంది అని అప్పుడే హంగామా షురూ అయ్యింది. అయితే కధ అక్కడితో అయిపోలే… ఈ సినిమాకి విలన్ కూడా దొరికేసాడు. సినిమాలో హీరోకి ధీటుగా, హీరోని మించి ఉండాలి అన్న ఆలోచనతో ఏకంగా కన్నడ టాప్ హీరోల్లో ఒకరైన ‘యష్’ ని విలన్ గా రాజమౌళి చూపించనున్నాడు అని రాజమౌళి చెప్పలేదు కానీ, యష్ ఈ సినిమాలో విలన్ అంటూ హంగామా మొదలయ్యింది.

అయినా సినిమా ఇంకా పూర్తిగా మొదలే కాలేదు, అప్పుడే హీరోయిన్ ని విలన్ ని డిసైడ్ చేసేశాయి మీడియా వర్గాలు. అంత తొందర దేనికి…టైటిల్ చెప్పి, హీరో పేర్లు చెప్పిన ఆయన మిగిలినవి కూడా చెప్తారు కదా…లేక చెప్పకుండా సస్పెన్స్ తో సినిమా రిలీజ్ చేసేస్తారా? వెయిట్ చేద్దాం…కాదు కాదు వెయిట్ చెయ్యండి జక్కన్న చెప్పేవరకూ.

ADVERTISEMENT
Latest Stories