రవితేజ… యావరేజ్ డైరెక్టర్లతో పని అవుతుందా?

Ravi Teja next movie with Gopichand malineniమాస్ మహారాజా రవితేజ గత కొంత కాలంగా హిట్లు లేక సతమతం అవుతున్నాడు. ఒక్కొక్క ప్లాప్ తరువాత మార్కెట్ కరిగిపోతూ వస్తుంది. ఇప్పుడు బడ్జెట్లు, రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే గానీ సినిమాలు తీయలేని పరిస్థితి. 2017లో వచ్చిన రాజా ది గ్రేట్ తప్ప 2014లో వచ్చిన పవర్ తరువాత రవితేజకు హిట్ అనేది లేదు. ఘోరమైన ప్లాపులు మాత్రం ఉన్నాయి.

రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇది ఇలా ఉండగా ఈరోజు దీపావళి సందర్భంగా రవితేజ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. గతంలో రవితేజకు డాన్ శీను, బలుపు వంటి హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే వీఐ ఆనంద్, గోపీచంద్ మలినేని వంటి యావరేజ్ డైరెక్టర్లు ఇప్పుడు రవితేజను గట్టెక్కించగలరా అనేది చూడాలి. డాన్ శీను, బలుపు సినిమాలు గొప్పవేమీ కాదు. కాకపోతే అప్పుడు రవితేజ ఎంటర్టైన్మెంట్ సినిమాల ట్రెండ్ నడిచేది కాబట్టి వర్క్ అవుట్ అయ్యాయి. ఈ క్రమంలో హిట్ కాంబినేషన్ అనే పేరుతో ఆ డైరెక్టర్ తో పని చేసినా ఉపయోగం ఉంటుందో లేదో చూడాలి.

సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాని నిర్మించనున్నారు. వారు విడుదల చేసిన పోస్టర్ ను బట్టి రవితేజ ఈ చిత్రంలో పోలీసు ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తం జరగబోతుంది.

ADVERTISEMENT
Latest Stories