క్యాడర్ కుస్తీలు…అధినేతల భేటీలు

Chandrababu Pawan Kalyan Meeting

స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇన్నేళ్ల స్నేహాన్ని విరోధంగా మార్చేసింది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ మొదలు, నేతల అసందర్భ ప్రకటనల వరకు ప్రతిదీ వివాదాస్పదంగానే మారింది. చివరికి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కూడా టీడీపీ, జనసేన పార్టీల మధ్య రాజకీయ చిచ్చుకి కారణంగా మారింది అంటే అతిశయోక్తి కాదేదో.

ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలలో మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ జనసైనికులు, మా పార్టీ బలం తగ్గిపోతుందంటూ తెలుగు తమ్ముళ్లు ఇలా ఎవరి ధోరణిలో వారు సోషల్ మీడియా వేదికగా యుద్దాలు చేసుకుంటున్నారు, క్షేత్ర స్థాయిలో ఆధిపత్య పోరు సాగిస్తున్నారు.

ADVERTISEMENT

పొత్తు వల్ల జనసేన రాజకీయంగా ఎదగలేకపోతుందంటూ జనసేన క్యాడర్ ఆవేదన చెందుతుంటే, పొత్తు కారణంగా టీడీపీ రాజకీయంగా కుచించుకుపోతుందంటూ పసుపు సైన్యం కలత చెందుతుంది. ఇలా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా వైసీపీ ఆశలకు రెక్కలిస్తున్నారు.

ఇలా ఇరు పార్టీల క్యాడర్ సీట్ల సంఖ్య తో నువ్వా – నేనా అన్నట్టుగా కుస్తీ పట్లు పట్టుకుంటుంటే మరోపక్క ఇరు పార్టీల అధినేతలు కామ్ అండ్ కంపోజ్ గా భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రభుత్వ కాన్వాయి లేకుండా సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు.

నేడు తన అధికారిక కాన్వాయితి మరోమారు బాబు ఇంటికి వెళ్లిన పవన్ మరోమారు బాబుతో భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, పొత్తు కారణంగా ఇరు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ, కోర్ట్ తీర్పులు, వైసీపీ ఆరోపణలు…ఇలా పలు అంశాల మీద ఈ ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం.

దానికి తోడు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి పవన్ రాజీనామా అంటూ సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తూ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య రాజకీయ చిచ్చు రేపడంతో పాటుగా కూటమి ప్రభుత్వాన్ని కూడా విచ్ఛిన్నం చెయ్యాలని చూస్తున్న అభూత శక్తులెవరు అనే అంశం కూడా ఈ ఇరువు నేతల భేటీలో చర్చకొచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అటువంటి ఫేక్ ప్రచారాల వెనుకున్న రాజకీయ కుట్రల పై విచారణకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇలా ఒకపక్క ఇరు పార్టీల క్యాడర్ మా పార్టీ గొప్ప అంటే మా పార్టీ గొప్ప అంటూ వాదించుకుంటున్న సమయంలో, మా అధినేతదే పై చేయి మా అధినేతదే పై చేయి అంటూ ఘర్షణలు పడుతున్న సందర్భంలో, మా పార్టీ బలం ఇంతా మీ పార్టీ బలహీనతలు ఇవి అంటూ ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో ఇటు పవన్, బాబు ల భేటీ ఇరు పార్టీల క్యాడర్ ని చల్లబరచి రాజకీయంగా వారందర్ని ఒకే తాటి మీదకు తెచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories