రాయలసీమకు పోదాం పదండి

Rayalaseema industrial growth and investments

రాయలసీమకు పాత నిర్వచనం కరువు, పేదరికం, నిరుద్యోగం, ఈ కారణంగా వలసలు పోయే జనం. కానీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నిర్వచనం పూర్తిగా మార్చేస్తున్నారు.

2014-2019 మధ్య కాలంలోనే రాయలసీమకు సాగునీటి వసతి కల్పించి, ఉద్యానవన పంటలు ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపట్టారు.

ADVERTISEMENT

రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు మంత్రి నారా లోకేష్‌ కూడా తోడయ్యారు. ఆయన యువగళం పాదయాత్రలో సీమ ప్రజల కష్టాలు, కన్నీళ్ళు, వారి అవసరాలు దగ్గర నుంచి చూసి తెలుసుకున్నారు.

రాయలసీమ సమస్యల పరిష్కారానికి కేవలం తాగు సాగు నీరు మాత్రమే సరిపోవు… భారీగా పరిశ్రమలు, వాటితో ఉద్యోగాల కల్పన కూడా అవసరమని గ్రహించారు.

అందుకే గత రెండున్నరేళ్ళలో రాష్ట్రానికి వచ్చిన రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, వాటిలో రాయలసీమ జిల్లాలకు రూ.4.58 లక్షల కోట్లు దక్కేలా చేశారు. అంటే మొత్తం పెట్టుబడులలో 20.27% పెట్టుబడులు రాయలసీమకు దక్కాయన్న మాట!

రాయలసీమ జిల్లాలలో పరిశ్రమల ఏర్పాటుకు 275 ఒప్పందాలు జరుగగా వాటితో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా సుమారు 3.57 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభించబోతున్నాయి.

2016లో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో జై రాజ్ ఇస్పాత్‌ (స్టీల్ ప్లాంట్‌)కు సీఎం చంద్రబాబు నాయుడు 430 ఎకరాలు కేటాయించగా, ఆ సంస్థ రూ.2,100 కోట్లతో స్టీల్ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టింది. దానికి 2018 మే నెలలో సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఆ స్టీల్ ప్లాంట్‌ నిర్మాణం పూర్తిచేసుకొని ఉత్పత్తి ప్రారంభించింది. దానిలో పనిచేస్తున్న వారిలో 65 శాతం మంది స్థానికులే.

మళ్ళీ అదే ప్రాంతంలో అదే కంపెనీ మరో రూ.3,378 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణకు సిద్ధమవుతోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 600 ఎకరాలు కేటాయించింది. ఈ ప్లాంట్ కూడా సిద్ధమైతే దీని ద్వారా అదనంగా 934 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పరోక్షంగా అనేక వందల మందికి ఉపాధి లభిస్తుంది.

ఇది కేవలం మరో మామూలు స్టీల్ ప్లాంట్‌ కానే కాదు. ఆసియాలోనే తొలిసారిగా ఎండ్లెస్ కాస్టింగ్ అండ్ రోలింగ్ లైన్ సాంకేతికతను ఇక్కడ వినియోగిస్తున్నారు. మొత్తం ప్రాంగణంలో దాదాపు మూడో వంతు పచ్చదనాన్ని అభివృద్ధి చేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు 45 ఎకరాల్లో పెద్ద రిజర్వాయర్‌ కూడా నిర్మించారు. కనుక చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా ప్లాంట్ అవసరాలకు కూడా రిజర్వాయర్ నుండి తగినంత నీళ్ళు లభిస్తున్నాయి.

రాయలసీమలో ఏర్పాటవుతున్న ఇటువంటి పరిశ్రమలతో స్థానిక యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు క్రమంగా తగ్గుతున్నాయి.

సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ కృషి ఫలించి రాయలసీమకు తాగు సాగు నీటితో పాటు ఇలా పరిశ్రమలు కూడా వస్తుంటే భవిష్యత్‌లో ఉద్యోగాలు, ఉపాధి కోసం రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలు కూడా రాయలసీమకు బయలుదేరినా ఆశ్చర్యం లేదు.

ADVERTISEMENT
Latest Stories