నందమూరి నటసింహం బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా ప్రారంభోత్సవ వేడుకకు స్వయానా బావ అయినటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాకపోవడం, ఇదే వేడుకపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ హైలైట్ కావడం రాజకీయంగా మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అసలు చంద్రబాబు ఈ వేడుకకు ఎందుకు హాజరు కాలేదు? బాలకృష్ణ 100వ సినిమాగా ప్రతిష్టాత్మకతను సంతరించుకున్న వేడుకకు రాలేకపోవడం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? అన్న ఆసక్తి నెలకొంది.
అయితే, ఇప్పటికే ఉగాది పర్వదినాన లాంచనంగా అమరావతిలో ప్రారంభమైన ఇదే సినిమా వేడుకలో చంద్రబాబు భాగస్వామి కావడంతో… ఈ వేడుకను కాస్త తేలికగా తీసుకున్నారన్న టాక్ వినిపిస్తుండగా, మరోవైపు కేంద్రమంత్రులు గన్నవరం విచ్చేయడంతోనే వారిని సాదరంగా ఆహ్వానించేందుకు చంద్రబాబు హాజరు కాలేకపోయారని మరో టాక్ వినపడుతోంది. ఏది ఏమైనా బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” ప్రారంభ వేడుక సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది.



