పవన్ కళ్యాణ్ కు కూడా ఇష్టం లేదు!

renu desai hates calling akira nandan as jr powerstarనా క్యూటీ చూడటానికి యురోపియన్‌ సినిమాలోని ఓ సీరియస్‌ క్యారెక్టర్‌లా ఉన్నాడంటూ’ సినీ న‌టి, ప్రొడ్యూస‌ర్, డైరెక్టర్ రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో త‌న‌ కుమారుడు అకీరా ఫోటో పోస్ట్ చేసింది. ఓ గేమ్‌ కోసం తన ల్యాప్‌టాప్‌లో ఆసక్తిగా వెతుకుతున్నాడని పేర్కొంది. ఎవరైనా త‌న కుమారుడిని జూనియర్ పవర్ స్టార్‌ అంటూ కామెంట్‌ చేస్తే వారి సోషల్‌ మీడియా ఖాతాలను తన ఫాలోవర్ల లిస్టు నుంచి డిలీట్‌ చేయించి, బ్లాక్‌ చేయిస్తానని హెచ్చ‌రించింది.

ADVERTISEMENT

అలా పిలవడం త‌న కుమారుడు అకీరాకు గానీ, అలాగే అత‌డి నాన్న పవన్ కళ్యాణ్ కు గానీ, అమ్మనైన త‌నకు గానీ ఇష్టం లేదని స్పష్టం చేసింది. ఫాలోవ‌ర్లు అలా అనడం ఆపాల‌ని హెచ్చ‌రించింది. సోష‌ల్ మీడియాలో త‌న పిల్ల‌ల గురించి అధికంగా పోస్టులు చేసే రేణూ దేశాయ్ ఒక్కోసారి భావోద్వేగపూరితంగా క‌విత‌లు రాస్తుంటుంది. తాజాగా ఆమె మ‌రోసారి ఇలాంటి పోస్టు చేయ‌డం ప‌ట్ల ఆమె ఫాలోవ‌ర్లలో కొంద‌రు ఇలా అన‌డం స‌రికాద‌ని అంటుండగా, మ‌రికొంద‌రు స‌రిగ్గా చెప్పార‌ని ప్ర‌శంసిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories