జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ వల్ల కొత్త చిక్కులు వచ్చి పడేలా ఉన్నాయి. ఆవిడ రెండో పెళ్లి కు సిద్దమైన తరుణంలో కొంత మంది అభిమానులు ఆమెను బెదిరిస్తుండటంతో ఆమె తిరగబడుతున్నట్టుగా ఉంది. ఈ క్రమంలో రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు కలకలం రేపింది.
“ఆ విషయం గురించి మాట్లాడాను అంటూనే … 11 సంవత్సరాలు నాతో కాపురం చేసి నాకు తెలియకుండా వేరే మహిళతో ఇంకో పాపని కన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీ జీవితంలో ఉంటే ఇలాగే సమర్థిస్తారా,” అని ఆమె పవన్ కళ్యాణ్ అభిమానులను సూటిగా ప్రశ్నించింది. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేగెత్తిస్తుంది.
అయితే ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్వయం కృతాపరాధం అనుకోవాలి. ఆమె ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడకపోయినా ఆమెను పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే నిన్ను నిన్ను చేసుకోబోయే వాడిని చంపేస్తాం అని కొంత మంది చేసిన బెదిరింపులే ఆమెను మరింత రెచ్చగొట్టి మాట్లాడేలా చేశాయి. ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా కూడా ఇబ్బంది కలిగించవచ్చు.



