పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన రేణు!

Renu Desai Tweet - Jr Power Star Tweetసినీ ఇండస్ట్రీలో ఈ రోజు (ఏప్రిల్ 8వ తేదీ) ముగ్గురు ప్రముఖ వ్యక్తుల పుట్టినరోజుకు నిలయంగా మారింది. అందులో ప్రధముడు అల్లు అరవింద్ తనయుడు, మెగా మేనల్లుడు అయిన అల్లు అర్జున్ కాగా, మరొకరు అక్కినేని యువ కిశోరం ‘కింగ్’ నాగార్జున తనయుడు అయిన అఖిల్. ఇక, మరో సెన్సేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అయిన అఖిరా నందన్. ఇలా ముగ్గురు వ్యక్తుల పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా మారుమ్రోగింది. బన్నీ, అఖిల్ లు సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తూ సందడి చేసారు.

అయితే అకీరా విషయంలో మాత్రం, తల్లి రేణుదేశాయ్ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ కు వారసుడిగా అకీరా కోసం ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ కు గట్టి షాక్ లాంటి ట్వీట్ చేసింది రేణు. తన తల్లితండ్రుల నీడలో బ్రతికే వ్యక్తిగా కాకుండా, తనకంటూ ఓ సొంత ఐడెంటిటీని అకీరా సృష్టించుకోవాలని, ఆ విధంగా చేయగలడన్న నమ్మకం తనకు ఉందని, జూనియర్ పవర్ స్టార్ లా కాకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ… తన తనయుడుకు పుట్టినరోజు ఆశీర్వాదాలు అందించింది.

ADVERTISEMENT

రేణు చేసిన ఈ ట్వీట్ పవన్ ఫ్యాన్స్ ను సూటిగా తాకింది. రేణు ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని జూనియర్ పవర్ స్టార్ లా ఉండకూడదని భావించిందో గానీ, అభిమానుల దృష్టిలో మాత్రం, అకీరా సిల్వర్ స్క్రీన్ కు రాడేమో అన్న అనుమానాలు బలపడ్డాయి. బాలనటుడిగా తల్లి దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమాలో నటించిన అకీరా, వెండితెర పైకి రాకపోతే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు నిరుత్సాహం తప్పకపోవచ్చు. రేణు చేసిన ట్వీట్ ఇలాంటి సందేహాలనే మిగిల్చింది.

ADVERTISEMENT
Latest Stories