2025 … తెలంగాణ పొలిటికల్ హీరో.?

Revanth Reddy vs KTR

2023 ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమి తరువాత తెలంగాణ రాజకీయాలు రేవంత్ రెడ్డి vs కేటీఆర్ అన్న చందంగా సాగాయి. కేసీఆర్ అజ్ఞాతంలో వెళ్లడంతో బిఆర్ఎస్ పార్టీ బాధ్యతలను పూర్తిగా భుజాన వేసుకున్నారు కేటీఆర్.

దీనితో అధికార – విపక్ష పార్టీల మధ్య జరిగే రాజకీయ పోరులో అటు రేవంత్ కి ధీటుగా కేటీఆర్ అన్నట్టుగా కేటీఆర్ ముందుకొచ్చారు. అలాగే బిఆర్ఎస్ పార్టీ రాజకీయానికి సంబంధించిన అన్ని అంశాలలో కేటీఆర్ ముందుండి నిలబడి రాజకీయం నడిపారు.

ADVERTISEMENT

అయితే కేటీఆర్ నాయకత్వంలో పార్టీ పోటీ చేసిన ఏ ఒక్క ఎన్నికలో కూడా బిఆర్ఎస్ విజయం సాధించలేకపోయింది. అలాగే పార్టీలో కేసీఆర్ సైలెన్స్ తరువాత కల్వకుంట కుటుంబంలో రాజకీయ చిచ్చు మొదలయ్యింది. బిఆర్ఎస్ పార్టీలో నేను కేసీఆర్ ని తప్ప మరొక వ్యక్తిని నాయకుడిగా అంగీకరించను అంటూ కవిత పరోక్షంగా కేటీఆర్ నాయకత్వం మీద చేసిన విమర్శలు బిఆర్ఎస్ లో గందరగోళాన్ని సృష్టించాయి.

ఆ గందరగోళం కాస్త పార్టీ నుంచి కవిత ను సస్పెన్షన్ వేటుతో బయటకువెళ్లేలా చేసాయి. అయితే ఇదంతా కూడా కేటీఆర్ హయాంలోనే జరగడంతో కేటీఆర్ నాయకత్వం పై కూడా తెలంగాణ రాజకీయాలలో విస్తృత చర్చ జరిగింది. సొంత చెల్లినే మెప్పించలేని కేటీఆర్ నాయకత్వం ఇక పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లగలుగుతుంది అంటూ కాంగ్రెస్ నుంచి కేటీఆర్ పై ఎదురుదాడి మొదలయ్యింది.

అలాగే ఇక రేవంత్ రెడ్డి విషయానికొస్తే అటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా పరమైన నిర్ణయాలు తీసుకుంటు, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధినేతగా పార్టీలో అసమ్మతి రాకుండా చూసుకుంటూ అధిష్టానం తన చేతికిచ్చిన రెండు బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారు.

కాంగ్రెస్ వంటి నాయకులు ఎక్కువగా ఉండే జాతీయ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనదైన ముద్రవేసుకున్న రేవంత్, జూబ్లీహిల్స్ వంటి బిఆర్ఎస్ బలమైన స్థానంలో కాంగ్రెస్ గెలుపు అంటే ఆ క్రెడిట్ మొత్తం రేవంత్ ఖాతాలోనే పడింది.

అలాగే 2025 సమ్మిట్ పేరుతో హైద్రాబాద్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ రేవంత్ పేరును దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి తెచ్చింది.

దానికి తోడు తాజాగా హైద్రాబాద్ లో జరిగిన ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సి పర్యటన ఆయనతో రేవంత్ మ్యాచ్ వంటి వినూత్న కార్యక్రమాలతో రేవంత్ జాతీయ మీడియాను సైతం ఆకర్షించారు. దీనితో 2025 తెలంగాణ రాజకీయాలలో మోస్ట్ పాపులర్ రాజకీయ నాయకుడుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పాలి.

ఇక రాష్ట్రంలో తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికలలో సైతం కాంగ్రెస్ తన హవా కొనసాగించడంతో ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి లేకుండా చేసుకోగలిగారు. అంటే 2025 లో రేవంత్ vs కేటీఆర్ గా సాగిన రాజకీయ యుద్ధంలో తన పార్టీని గెలిపించుకుంటూ, తానూ గెలుస్తూ కేటీఆర్ పై రేవంత్ పూర్తిగా ఆధిపత్యాన్ని సాగించారనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories