తెలంగాణలో నయా ట్రెండ్: ‘ఇలాకా’ రాజకీయం.?

Revanth Reddy vs BRS: Sircilla to Kondangal Political Battle

నిన్నమొన్నటి వరకు కల్వకుంట్ల ఆస్తుల చిత్తపొద్దు అంటూ రేవంత్ vs కల్వకుంట్ల గా నడిచిన తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సిరిసిల్ల – కొండగల్ మధ్య కి చేరాయి. తాజాగా సీఎం రేవంత్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల పర్యటనకు వెళ్లారు.

ఆ పర్యటనలో భాగంగా రేవంత్, కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో సుమారు 5 కిమీ మేర పాదయాత్ర చేసారు, స్థానిక ప్రజలతో ముచ్చటించారు, అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. అలాగే సీఎం రేవంత్ ప్రభుత్వం పరంగా ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు.

ADVERTISEMENT

బహిరంగ సభా వేదిక నుంచి బిఆర్ఎస్ పార్టీ పై ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్ గా అనేక విమర్శనాస్త్రాలు సంధించారు. సిరిసిల్ల ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనే భావన కలిగేలా, గట్టిగా ప్రయత్నిస్తే సిరిసిల్లలో కూడా గులాబీ జెండాకు బదులు కాంగ్రెస్ జెండా ఎగరేయొచ్చు అనేలా పార్టీ క్యాడర్లో భరోసా నింపగలిగారు.

అలాగే తన పర్యటనతో ప్రత్యర్థి పార్టీలో ఒక ప్రకంపన సృష్టించగలిగారు. ఇలా తన ఈ ఒక్క పర్యటనతో రేవంత్ తన పర్యటన లక్ష్యాలను కేటీఆర్ కి , బిఆర్ఎస్ శ్రేణులకు స్పష్టంగా పంపగలిగారు. నిన్న సిరిసిల్ల పర్యటన మాదిరే బిఆర్ఎస్ మరో కీలక నేత, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు సొంత నియోజకవర్గమైన సిద్దిపేటలో కూడా సీఎం రేవంత్ పర్యటనకు, భారీ బాహిరంగ సభకు ప్రణాళికలు జరుగుతున్నాయి.

రేవంత్ ఇలా కల్వకుంట్ల బ్రాండ్ ఇమేజ్ టార్గెట్ గా సాగిస్తున్న ఈ రాజకీయ పోరుకు కౌంటర్ గా బిఆర్ఎస్ కూడా రేవంత్ సొంత నియోజకవర్గమైన కొండగల్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నామని, ఆ సభను విజయవంతం చేసి రేవంత్ రెడ్డి కి చెమటలు పట్టిస్తామంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటించారు.

సిద్దిపేటలో రేవంత్ బహిరంగ సభ తరువాత కొండగల్ లో బిఆర్ఎస్ పార్టీ సభ ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల సభ ద్వారా కేవలం బలప్రదర్శన మాత్రమే చెయ్యగలిగింది, రేపు సిద్దిపేటలో కూడా రేవంత్ పర్యటన బలప్రదర్శనకే పరిమితం అవుతుందంటూ కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చారు.

అయితే రేవంత్, బిఆర్ఎస్ లు ఇలా ఒకరి ఇలాకాలో మరొకరు సభలు నిర్వహించి బలప్రదర్శనలు చేసి, ప్రత్యర్థి పార్టీలకు ఎం మెసెజ్ ఇవ్వాలనుకుంటున్నారు. కేవలం పర్యటనలతో, బహిరంగ సభలతో బిఆర్ఎస్ కంచుకోటాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకోగలుగుతుందా.? కాంగ్రెస్ హస్తంలో ఉన్న నియోజవర్గంలో గులాబీ కారు పయనిస్తుందా.?

నిన్న సిరిసిల్ల, రేపు సిద్ధిపేట అంటూ కాంగ్రెస్ ఆ మరుసటి రోజు కొండగల్ అంటూ బిఆర్ఎస్ చేస్తున్న ఈ ఇలాకా ల రాజకీయం చివరికి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వెల్ తో ఆగనుందా.? లేదా అంతకు మించి ముందుకెళ్లగలదా.?

ADVERTISEMENT
Latest Stories