వైరల్ వీడియో:నన్ను దాటి బాబుని టచ్ చేయండి.

Revanth Viral Video On Chandrababu Naidu

గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ సంబరాలు జరుపుకోండి అంటూ ప్రకటించిన దగ్గర నుండి రేవంత్ రెడ్డిది అతి విశ్వాసమా?ఆత్మ విశ్వాసమా? గెలుపు పై ఇంతటి ధీమా ఎక్కడిది? గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడా? అవ్వడా? అంటూ రేవంత్ వీడియోల పై సోషల్ మీడియాలో పలు చర్చలు ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే బాబుని ఉద్దేశించి రేవంత్ మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఓటుకు నోటు అంటూ ఎదో పీకుతానంటున్నాడు కదా కేసీఆర్ అదేదో పీకమనండి. నేను కూడా చూస్తా అంటున్నాగా,చంద్రబాబు నాయుడు అంత దూరమెందుకు నేను ఈడనే ఉన్నా కదా. ముందు నన్ను దాటమను. నన్ను దాటినాకనే గదా అమరావతి పోయేది బాబుని తాకేది. రమ్మను చంద్రశేఖర్ వస్తాడో, ఆయన వెనుక ఉన్న మోడీ వస్తాడో రమ్మను.

ADVERTISEMENT

ఆయన అనుభవంలో బాబు ఇలాంటి ఉడత ఊపుళ్ళు ఏన్ని చూసుంటాడు, ఏస్తే ఒకటి దిగితే ఇంకోటి మాట్లాడే కేసీఆర్ మాటలకు విలువుందా?అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ శ్రేణులు సామజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ తనకు రాజకీయ అవకాశం ఇచ్చిన నాయకుడి పట్ల ఉండాల్సిన నిబద్దత అంతే ఇదేకదా అంటూ కొడాలి, వల్లభనేని, రోజా, విడుదల రజని ని ఉద్దేశించి మీమ్స్ రెడీ చేస్తున్నారు బాబు, రేవంత్ అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories