కమ్మ రాజ్యంలో కడప రెడ్లు: ఏపీలో కులల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం

RGV - Kamma -Rajyam Lo Kadapa Reddlu Trailer Talkరామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రం ట్రైలర్ విడుదల చేసాడు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిణామాల గురించి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరిట ఒక సినిమా తీశారు వర్మ. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నట్టుగా వర్మ ఈ సినిమాలో చూపించడం విశేషం.

విజయవాడలో హింసని ప్రోత్సహించినట్టుగా చూపించి, అది కూడా కమ్మ, రెడ్డి కులాల మధ్య అంటూ ఆ కులాల పేరిట బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో అత్యంత జుగుప్సాకరంగా కులాల మధ్య కుంపట్లు రేపే ప్రయత్నం చెయ్యడం బాధాకరం. నారా లోకేష్ ని కూడా అభ్యంతరకరంగా చూపించడం టీడీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ADVERTISEMENT

చంద్రబాబు పాత్రధారి పప్పు వడ్డించడాన్ని బట్టి వర్మ లోకేష్‌ని గట్టిగానే టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం ఇప్పటికే కొన్ని చోట్ల రాజకీయ హత్యలు జరగడం మనం చూశాం. ఇటువంటి సినిమాలు ఈ తరుణంలో మరింత ప్రమాదకరం. పవన్ కళ్యాణ్ ని కూడా చిత్రంలో టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటువంటి సినిమాల వల్ల తమకు రాజకీయ మైలేజ్ వస్తుందని అనుకోకుండా సంఘంలో కులఘర్షణలకు ఆస్కారమిచ్చే ఇటువంటి సినిమాలు రాకుండా చూస్తే ఆయనకే మంచిది. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించగా.. వర్మ రచన, సహ దర్శకత్వం వహించారు. అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories