“రక్తచరిత్ర” సినిమాతో మళ్ళీ తెలుగునాట తన పునర్వైభావాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ, ఇక టాలీవుడ్ కు ‘గుడ్ బై’ చెప్పనున్నారు. ఈ జనవరి 1వ తేదీన విడుదల కాబోతున్న “కిల్లింగ్ వీరప్పన్” తర్వాత తానూ మళ్ళీ ముంబైకు వెళ్ళిపోతున్నట్లు రాంగోపాల్ వర్మ ‘ట్విట్టర్’ ద్వారా ప్రకటించారు.
“మెగా ఫ్యామిలీపై తన ట్వీట్లు మిస్ అవుతున్నానని, అలాగే పూరీ జగన్నాధ్, కేసీఆర్, తన తల్లిని మిస్ అవుతున్నానని…” ఈ సందర్భంగా వర్మ చెప్పారు. అయితే అసలు ‘సెంటిమెంట్’ అంటే తెలియని వర్మ, ఇలా పలువురిని మిస్ అవుతున్నానని చెప్పడం చమత్కరించడమే అని అంటున్నారు నెటిజన్లు.
వర్మ ముంబైకు వెళ్ళడం ఎవరికి సంతోషం కలిగించినా, లేకున్నా మెగా అభిమానులకు మాత్రం కాస్త ఊరటనిచ్చే అంశం. మెగా ఫ్యామిలీపై సైటర్లు వేస్తూ అభిమానులకు ఎన్నో కాళరాత్రులను మిగిల్చిన వర్మ, ఎట్టకేలకు అలాంటి ట్వీట్లకు దూరమవుతున్నానని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ఘనమైన వీడ్కోలు పలుకుతున్నారు.





